Pawan Kalyan: సుజిత్‌తో ఓజీ స్టైలిష్ స్టిల్.. పవన్ ఫ్యాన్స్‌కు కన్నుల పండుగే
తెలుగు చిత్ర పరిశ్రమలో అతి తక్కువ మంది స్టార్ హీరోలు మాత్రమే వరుస పెట్టి సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. అలాంటి వారిలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒకడు. రాజకీయాల కోసం తీసుకున్న గ్యాప్‌ను భర్తీ చేసేందుకు ఇప్పుడు వరుస చిత్రాలతో సందడి చేస్తున్నాడు. అలా ఇప్పటికే పలు సినిమాల ద్వారా అతడు ప్రేక్షకులను, అభిమానులు మెప్పించాడు.
ప్రస్తుతం పవన్ కల్యాణ్ పలు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. అందులో 'OG' (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) ఒకటి. టాలెంటెడ్ డైరెక్టర్ సుజిత్ దీన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీని భారీ బడ్జెట్‌తో తీస్తున్నారు. యాక్షన్ జోనర్‌లో 1990 నాటి బ్యాగ్‌డ్రాప్‌తో రాబోతున్న ఈ చిత్రంపై ఆరంభంలోనే హైప్ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే ఈ మూవీని రూపొందిస్తున్నారు.

హై రేంజ్ యాక్షన్‌తో రూపొందుతోన్న 'OG' మూవీకి సంబంధించిన షూటింగ్ కొద్ది రోజుల వ్యవధిలోనే యాభై శాతం వరకూ పూర్తైంది. దీంతో ఈ సినిమా నుంచి చిత్ర యూనిట్ వరుసగా అప్‌డేట్లు ఇస్తోంది. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితమే ఈ సినిమా నుంచి గ్లింప్స్ వీడియో వచ్చింది. దీనికి అన్ని వర్గాల వాళ్ల నుంచి అదిరిపోయే స్పందన కూడా సొంతం అయింది.
పవన్ కల్యాణ్ - సుజిత్ కాంబినేషన్‌లో రాబోతున్న 'OG' మూవీకి సంబంధించిన షూటింగ్‌కు ప్రస్తుతానికి బ్రేక్ పడిపోయింది. పవర్ స్టార్ రాజకీయాలపై ఫోకస్ చేస్తుండడం వల్లే దీనికి విరామం తీసుకుంటున్నారు. అయినప్పటికీ ఫ్యాన్స్ ఏమాత్రం నిరాశ చెందకుండా చిత్ర యూనిట్ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ స్టైలిష్ పిక్‌ను డైరెక్టర్ షేర్ చేశాడు.

'OG' (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) మూవీకి సంబంధించిన షూటింగ్ స్పాట్‌లో డైరెక్టర్ సుజిత్ భుజంపై పవన్ కల్యాణ్ చేయి వేసి ఉండగా తీసిన ఫొటో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇందులో పవర్ స్టార్ వెనుక నుంచే వింటేజ్ స్టైలిష్ లుక్‌తో కనిపించి సర్‌ప్రైజ్ చేస్తున్నాడు. దీన్ని సదరు దర్శకుడు తన ఇన్‌స్టాలో ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకున్నాడు. దీంతో ఇది ఇంటర్నెట్‌ను షేక్ చేసేస్తోంది.
ఇదిలా ఉండగా.. 'OG' చిత్రాన్ని RRR ప్రొడ్యూసర్ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇందులో ప్రియాక అరుల్ మోహన్ హీరోయిన్‌గా చేస్తోంది. అలాగే, అర్జున్ దాస్, ప్రకాశ్ రాజ్, ఇమ్రాన్ హష్మీ, శ్రీయా రెడ్డి సహా ఎంతో మంది కీలక పాత్రల్లో చేస్తున్నారు. ఎస్ థమన్ దీనికి మ్యూజిక్ చేస్తున్నాడు.


Click it and Unblock the Notifications











