OG: టాలీవుడ్‌లో పవన్ సెన్సేషన్.. గుడ్ న్యూస్ చెప్పిన RRR నిర్మాత
గతంలో కంటే ఇప్పుడు తెలుగు హీరోల స్థాయి గణనీయంగా పెరిగిపోయింది. దీంతో మన వాళ్లంతా తమ మార్కెట్‌ను పెంచుకోవడానికి భారీ చిత్రాలను చేస్తున్నారు. ఫలితంగా ఆయా స్టార్ల నుంచి సినిమాలు చాలా ఆలస్యంగా వస్తున్నాయి. కానీ, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాత్రమే ఏకకాలంలో నాలుగైదు ప్రాజెక్టులను చేస్తూ సత్తా చాటుతోన్నాడు. ముఖ్యంగా రీఎంట్రీ ఇచ్చిన తర్వాత అతడి స్పీడ్ అమాంతం పెరిగింది. ఈ క్రమంలోనే ఇప్పుడు పవన్ 'OG' (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) అనే ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీలో నటిస్తున్నాడు. దీంతో దీనిపై భారీ హైప్ ఏర్పడింది.
తక్కువ చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్న యంగ్ డైరెక్టర్ సుజిత్‌తో పవన్ కల్యాణ్ చేస్తున్న చిత్రమే 'OG' (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్). ఈ సినిమా మాఫియా బ్యాగ్‌డ్రాప్‌తో హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. గత ఫిబ్రవరిలోనే ఈ సినిమాకు సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్‌ను ముంబై నగరంలో మొదలు పెట్టారు. అక్కడ పవన్ కల్యాణ్ సహా కొందరు సినీ ప్రముఖుల కాంబినేషన్‌లో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు. ఆ వెంటనే మరికొన్ని షెడ్యూళ్లను ప్లాన్ చేయడం.. వాటిని పూర్తి చేయడం చకచకా జరిగిపోయాయి.

పవర్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న 'OG' (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) సినిమాకు సంబంధించిన మూడో షెడ్యూల్‌ను చిత్ర యూనిట్ తాజాగా పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ట్విట్టర్ ఖాతా ద్వారా అధికారికంగా వెల్లడించింది. అంతేకాదు, ఇప్పటికే 50 శాతానికి పైగా టాకీ పార్టును కూడా కంప్లీట్ చేసినట్లు ప్రకటించింది. ఈ మేరకు షూటింగ్ స్పాట్‌లో తీసుకున్న ఓ గ్రూప్ ఫొటోను షేర్ చేసింది. ఇక, ఇంత త్వరగా సగం షూటింగ్ పూర్తి కావడం టాలీవుడ్‌లో సెన్సేషన్‌గా మారింది. పవన్ స్పీడుకు అంతా షాక్ అవుతున్నారు.
ఇక, పవన్ కల్యాణ్ - సుజిత్ కాంబోలో రాబోతున్న 'OG' (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) చిత్రాన్ని RRR ప్రొడ్యూసర్ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దానయ్య నిర్మిస్తున్నారు. ఇందులో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా చేస్తోంది. ప్రకాశ్ రాజ్, ఇమ్రాన్ హష్మీ, శ్రీయా రెడ్డి ఈ సినిమాలో కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ చిత్రం వచ్చే డిసెంబర్‌లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











