OG పవన్ కళ్యాణ్ లేటెస్ట్ ఫొటో.. గ్యాంగ్ స్టర్ స్మార్ట్ లుక్ అదిరింది!
పవన్ కల్యాణ్.. ఈ పేరు వింటే చాలు చాలా మంది తెగ ఎగ్జైట్ అయిపోతుంటారు. మా అన్నయ్య, మా అన్నయ్య అంటూ నెత్తిన పెట్టుకుంటారు. అలాంటి పవన్ కల్యాణ్ సినిమా వస్తుందంటే మరింత ఖుషీ అయిపోతుంటారు. అయితే ఈ మధ్య పవన్ కల్యాణ్ రెండు పడవల మీద ప్రయాణం చేస్తున్నారు. ఓ కాలు రాజకీయాల్లో, మరో కాలు సినిమాల్లో వేస్తూ.. దూసుకెళ్తున్నారు. ఈ క్రమంలోనే వరుస చిత్రాలకు సైన్ చేస్తూ.. షూటింగ్ చేసుకుంటూ వెళ్లిపోతున్నారు.
అందులోనూ ఎక్కువ రీమేక్, త్వరగా అయిపోయే చిత్రాలకే ఓకే చెప్పి షూటింగ్ లలో కూడా పాల్గొన్నారు. ఇటీవలే వినోదయ సీతం షూటింగ్ చిత్రీకరణలో పాల్గొన్న అతను.. తాజాగా సుజిత్ డైరెక్షన్ లో రాబోతున్న ఓజీ, హరీష్ శంకర్ దర్శకత్వంలో రాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలను లైన్ లో పెట్టారు. ఈ సినిమాల షూటింగ్ లో పాల్గొనేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఓజీ (ఒరిజినల్ గ్యాంగ్ స్టర్) సినిమాకు సంబంధించిన ఓ లేటెస్ట్ అప్ డేట్ వెలుగులోకి వచ్చింది.

OG సినిమాలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చాలా స్మార్గ్ గా కనిపించబోతున్నారు. ఇందుకు సంబంధించిన ఓ ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. అందులో బ్లూ కలర్ టీషర్ట్ లైట్ గడ్డం, సింపుల్ వాచ్.. మెడలో ఓ తాయత్తుతో చాలా సింపుల్ లుక్ లో కనిపిస్తున్నారు. ఇందులో పవన్ కల్యాణ్ చాలా యంగ్ గా ఉన్నారు. ఈ ఫొటో చూసిన ప్రతీ ఒక్కరూ పవన్ కల్యాణ్ లుక్ అదిరిందంటూ కామెంట్లు చేస్తున్నారు.
పవన్ తన కొత్త లుక్‌లో స్లిమ్‌గా మరియు ట్రిమ్‌గా కనిపిస్తూ.. దర్శనం ఇస్తున్నారు. అయితే ఇదే లుక్ లో ఉస్తాద్‌లో కూడా కనిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఒకే సారి ఈ రెండు చిత్రాల చిత్రీకరణ జరగుతోంది. మరి రెండు చిత్రాల్లోనూ ఇదే లుక్ లో కనిపిస్తారా, ఉస్తాద్ కోసం లుక్కు మారుస్తారా అనేది తెలియాలంటే ఇంకా కొంత కాలం ఆగాల్సిందే.
ఓజీ సినిమాలో పవన్ కల్యాణ్ సరసన ప్రియాంక అరుల్ మోహన్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. పవన్ కల్యాణ్ ఓజీ సినిమా ముంబై బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని తెలుస్తోంది. గ్యాంగ్ స్టర్ డ్రామా కోసం మంచి మంచి ప్రాంతాలను వెతికేందుకు దర్శకుడు సుజిత్, తన సినిమాటోగ్రాఫర్ రవి కె చంద్రన్‌తో కలిసి ఇటీవలే ముంబైకి కూడా వెళ్లారు. నగరమంతా తిరిగి తమకు కావాల్సిన ప్రాంతాలను జల్లెడ పట్టారు.


Click it and Unblock the Notifications











