Pawan Kalyan అభిమానులకు గుడ్ న్యూస్.. ఉస్తాద్ భగత్ సింగ్ టార్గెట్ కూడా ఫిక్స్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుసగా డిఫరెంట్ సినిమాలను లైన్లో పెడుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమాతో పాటు వినోదాయ సితం రెండు సినిమా కూడా సెట్స్ పై ఉన్న విషయం తెలిసిందే. ఇక వీటితోపాటు యువ దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో కూడా OG అనే ప్రాజెక్టును త్వరలోనే మొదలుపెట్టబోతున్నారు.
ఇక హార్డ్ కోర్ ఫాన్స్ అయితే ఎక్కువగా హరిష్ శంకర్ దర్శకత్వంలో చేయబోతున్న సినిమా పైన అంచనాలు పెట్టుకున్నారు. మొదట వీరి కలయికలో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక మళ్ళీ చాలాకాలం తర్వాత భవదీయుడు భగత్ సింగ్ అనే సినిమా చేయాలని అనుకున్నారు. కానీ ఆ ప్రాజెక్టు ఊహించని విధంగా క్యాన్సిల్ అయింది.

అయితే మళ్ళీ ఇప్పుడు తమిళ మూవీ తేరి కథ ఆధారంగా తెలుగులో రీమేక్ చేయడానికి రెడీ అయ్యారు. ఈ సినిమాకు ఉస్తాద్ భగత్ సింగ్ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించబోతున్న ఈ సినిమాపై అంచనాలు అయితే మామూలుగా లేవు. తప్పకుండా హరిష్ శంకర్ పవన్ కళ్యాణ్ ను సరికొత్తగా చూపిస్తాడు అని ఫ్యాన్స్ నమ్ముతున్నారు.
ఇక ఈ సినిమా షూటింగ్ పై చాలా రోజులుగా కొంత సస్పెన్స్ అయితే కొనసాగుతోంది. ఇక మొత్తానికి ఏప్రిల్ ఫస్ట్ వీక్ నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలు కాబోతోంది. దాదాపు పది రోజులపాటు జరగబోయే ఆ కీలకమైన షెడ్యూల్లో పవన్ కళ్యాణ్ కూడా భాగం కానున్నాడు. ఇక ఈ సినిమాలో లేటెస్ట్ గ్లామరస్ హీరోయిన్ శ్రీలీల నటిస్తోంది.
మొదట పూజా హెగ్డేను తీసుకోవాలని అనుకున్నప్పటికీ మళ్ళీ ఎందుకో ఆమెను క్యాన్సిల్ చేశారు. ఇక శ్రీలీల పర్ఫెక్ట్ అని మైత్రి మూవీ మేకర్స్ డిసైడ్ అయింది. అయితే ఆమె ఫైనల్ అయ్యిందా లేదా అనే విషయంలో కూడా అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. కానీ మొత్తానికి అయితే శ్రీలీలనే పవన్ కళ్యాణ్ కు జోడిగా నటించేందుకు ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాను వచ్చే ఎడాది సమ్మర్లో విడుదల చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











