హరి హర వీరమల్లు, ఓజీ షూట్ కంప్లీట్.. మరి ఉస్తాద్ భగత్ సింగ్ సంగతేంటీ?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తను ఒప్పుకున్న సినిమాలను ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పవనుడిని వెండితెరపై చూసేందుకు అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు, ప్రపంచ వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ కు ఉన్న అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో నెక్ట్స్ సినిమా రిలీజ్ ఎప్పుడు అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ కూడా ఏమాత్రం విరామం తీసుకోకుండా తను సైన్ చిత్రాలకు సంబంధించిన షూటింగ్ పార్ట్ ను కంప్లీట్ చేస్తూ వస్తున్నారు. ఇక తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ కు సంబంధించిన షూటింగ్ వివరాలు అందాయి.
యమ స్పీడ్ గా పవన్ కళ్యాణ్ షూటింగ్..
పవన్ కళ్యాణ్ తన లైనప్ లో ఉన్న చిత్రాలను ఒక్కొక్కటిగా కంప్లీట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఏఎం రత్నం నిర్మిస్తున్న 'హరి హర వీరమల్లు' చిత్ర షూటింగ్, డబ్బింగ్ పార్ట్ ను కూడా పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. అలాగే యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న 'ఓజీ' చిత్ర షూటింగ్ ను కూడా రీసెంట్ గానే పూర్తి చేసుకున్నారు. మేకర్సే రీసెంట్ గా అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించారు. కాగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురి దర్శకుడు హరీశ్ శంకర్ పైనా పడిందని తెలుస్తోంది. ఈ మేరకు తాజాగా ఇంట్రెస్టింగ్ న్యూస్ అందుతోంది.

ఉస్తాద్ భగత్ సింగ్ పై పవన్ గురి..
డాషింగ్ డైరెక్టర్ హరీశ్ శంకర్ తో కలిసి పవన్ కళ్యాణ్ గతంలో 'గబ్బర్ సింగ్' సినిమా చేసిన సంగతి తెలిసిందే. 2012లో విడుదలైన ఆ చిత్రం భారీ సక్సెస్ ను అందుకుంది. ఆ తర్వాత 10 ఏళ్లకు మళ్లీ పవన్ కళ్యాణ్ తో హరీశ్ శంకర్ 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రాన్ని మొదలు పెట్టారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నవీన్ యేర్నేని, రవి శంకర్ నిర్మిస్తున్నారు.అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు, ఓజీ షూటింగ్ లను కంప్లీట్ చేయడంతో ఇక అదే వరుసలో ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాన్ని కూడా పూర్తి చేయనున్నారు.
అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్..
పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మేకర్స్ షూటింగ్ ను ప్రారంభించారు. ప్రస్తుతం అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రత్యేక సెట్లలో షూటింగ్ జరుగుతోంది. జూన్ 10 నుంచే షూట్ రీస్టార్ట్ అయ్యింది. అయితే పవన్ కళ్యాణ్ ఇంకా సెట్స్ లోకి అడుగు పెట్టలేదు. పవన్ కళ్యాణ్ డేట్స్ ఇచ్చే వరకు ఆయన లేని సీన్లను చిత్రీకరించినట్టు తెలుస్తోంది. అయితే పవన్ కళ్యాణ్ జూన్ 11 నుంచి షూటింగ్ కు హాజరవుతారని తెలిపారు. తాజాాగా సెట్స్ లో అడుగు పెట్టారు.
ఇక అప్పటి వరకు మిగితా ఆర్టిస్ట్ లతో తీయాల్సిన షూటింగ్ పార్ట్ ను కంప్లీట్ చేశారంట. అయితే ఈ షెడ్యూల్ 30 రోజుల పాటు ఉంటుందని అంటున్నారు. ఇక పవన్ కళ్యాణ్ కు సంబంధించిన షూటింగ్ పార్ట్ ను మొత్తం ఈ సమయంలోనే పూర్తి చేయబోతున్నారని తెలుస్తోంది. ఈ సినిమాకు ఈ షెడ్యూల్ చాలా కీలకం. దీం తర్వాత మరో షెడ్యూల్ తో సినిమా పూర్తి కానుందని అంటున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ శ్రీలీలా నటిస్తోంది.దేవీ శ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. 2026 సమ్మర్ లో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక 2025 సెప్టెంబర్ 25న ఓజీ చిత్రం విడుదల కాబోతోంది. జూన్ నెలలోనే 'హరి హర వీరమల్లు' చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు.


Click it and Unblock the Notifications











