పాయల్ రాజ్‌పుత్ లీక్ చేసేసింది.. రవితేజతో అలా!
మాస్ మహారాజ్ రవితేజ లుక్ లీక్ చేసేసింది Rx 100 బ్యూటీ పాయల్ రాజ్‌పుత్. రవితేజ హీరోగా రాబోతున్న కొత్త సినిమాలో ఆయనతో కలిసి నటిస్తున్న పాయల్ సరదాగా ఓ సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో డిస్కో రాజా సినిమాలో రవితేజ లుక్ ఎలా ఉండనుందనే ఆసక్తికి తెరపడింది. కెరీర్ లో హిట్ కోసం తాపత్రయంగా ఉన్న రవితేజ లుక్ పట్ల ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నాడు.
ఇప్పటికే రెండు షెడ్యూల్స్ షూటింగ్ పూర్తి చేసుకున్న డిస్కో రాజా.. మరో షెడ్యూల్ షూటింగ్ ఢిల్లీలో జరుగనుంది. ఈ షెడ్యూల్ ఆగస్టు 4 వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్ పూర్తయిన వెంటనే తదుపరి షెడ్యూల్ షూటింగ్ స్విజర్లాండ్‌లో జరపనున్నారు యూనిట్ సభ్యులు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టైటిల్ లుక్ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన తెచ్చుకుంది.

ఇటీవలే అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాతో డిసాస్టర్ ఖాతాలో వేసుకున్న రవితేజ.. ఈ సారి ఎలాగైనా బ్లాక్‌బస్టర్ సాధించాలనే కసితో వీఐ ఆనంద్ దర్శకత్వంలో డిస్కోరాజా సినిమా చేస్తున్నాడు. ఎస్.ఆర్.టి. ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రామ్ తాళ్లూరి నిర్మాతగా వ్యవహరిస్తుండగా, థమన్ సంగీతం అందిస్తున్నారు. చిత్రంలో రవితేజ సరసన నభా నటేష్, పాయల్ రాజ్‌పుత్, ప్రియాంక జవల్కర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వెన్నెల కిషోర్, సత్య కీలక పత్రాలు పోషిస్తున్నారు.


Click it and Unblock the Notifications











