Pawan Kalyan ఖరీదైన బైక్‌పై పవర్ స్టార్.. రోడ్డుపై పవన్ కల్యాణ్ అలా .. వీడియో వైరల్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఓ వైపు సినిమాలు చేస్తూనే మరో వైపు రాజకీయాలలో కూడా తనదైన శైలిలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న వినోదాయ సీతమ్ మూవీ రీమేక్ షూటింగ్ జరుగుతుంది. అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది. ఇక ఈ రెండు సినిమాల షూటింగ్స్ ఒకదాని తర్వాత ఒకటి ఫినిష్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ కి సంబందించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
పవన్ కళ్యాణ్ బైక్ పై అలా రోడ్డు మీద వెళ్తూ ఉన్నాడు. అతని వెనుక ఎస్కార్ట్ వెహికల్ వెళ్తుంది. ఈ వీడియోని పవర్ స్టార్ అభిమానులు కూడా షేర్ చేస్తూ ఉన్నారు. దీంతో ఈ వీడియో కాస్తా వైరల్ గా మారింది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ట్విట్టర్ ప్రొఫైల్ నుంచి ఈ వీడియో షేర్ అయ్యింది. ఇదిలా ఉంటే ఈ వీడియోపై పవర్ స్టార్ అభిమానులు భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు. అన్నయ్య రోజులు మంచిగా లేవు సెక్యూరిటీ పెట్టుకోండి అంటూ కొంతమంది సలహా ఇస్తున్నారు.

ఇక పవన్ కళ్యాణ్ ఎలా ఉన్న ఆయన స్వాగ్ వేరుగా ఉంటుంది అంటూ కొంతమంచి కామెంట్స్ చేస్తూ ఉండటం విశేషం. ఇక అయితే ఈ లుక్ ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్న వినోదయ సీతం లోనిది అనే టాక్ కూడా వినిపిస్తుంది. అలాగే పవన్ కళ్యాణ్ నడుపుతున్న బైక్ కూడా అత్యంత ఖరీధైనది కావడంతో ఆ బైక్ ఏ కంపెనీ, ధర ఎంత అనేది కూడా తెలుసుకోవడానికి పవర్ స్టార్ అభిమానులు ఆశ చూపిస్తున్నారు.
ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ మానియా గతంలో కంటే ఇప్పుడు మరింత పెరిగిపోయింది అని చెప్పాలి. ఈ నేపధ్యంలో ఆయనకి సంబందించిన ఏ వీడియో బయటకి వచ్చిన అది వెంటనే వైరల్ అవుతుంది. ఇక ప్రస్తుతం సర్క్యులేట్ అవుతున్న వీడియో కూడా కొంతమంది పాతది అని చెబుతూ ఉండగా మరికొంత మంది మాత్రం సినిమా షూటింగ్ లో భాగంగా పవన్ కళ్యాణ్ బైక్ నడిపి ఉంటాడు అనే టాక్ కూడా వినిపిస్తుంది.


Click it and Unblock the Notifications











