రాధే శ్యామ్ డిజాస్టర్ అనంతరం ఆ ప్రాజెక్ట్ తో బిజీగా ప్రభాస్.. ఒక్క సీన్ కోసమే ఊహించని బడ్జెట్!

రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమా తరువాత అదే తరహాలో వరుస విజయాలు అందుకోవాలని అనుకున్నప్పటికీ ఆ ప్రాజెక్ట్ లు ఏ మాత్రం సక్సెస్ కావడం లేదు. సాహో సినిమా కనీసం ఓ వర్గం ప్రేక్షకులను ఆకట్టుకుంది. కానీ ఆ తర్వాత వచ్చిన రాధే శ్యామ్ సినిమా మాత్రం ఊహించని విధంగా డిజాస్టర్ గా నిలిచింది. ప్రభాస్ సినిమా కెరీర్ లోనే రాధే శ్యామ్ సినిమా అత్యధిక స్థాయిలో నష్టాలను కలిగించిన సినిమా కావడం విశేషం. గోపి కృష్ణ బ్యానర్ యువి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన రాధే శ్యామ్ సినిమా దాదాపు 100 కోట్ల వరకు నష్టాలను మిగిల్చిందిని తెలుస్తోంది. అయితే ప్రభాస్ ముందు జాగ్రత్తగా డిస్ట్రిబ్యూటర్స్ పై ప్రభావం పడకుండా పారితోషికాన్ని కూడా వెనక్కి ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం ప్రభాస్ ఇండియా లోనే అత్యధికంగా 150 కోట్ల పారితోషికాన్ని అందుకుంటున్న విషయం తెలిసిందే.

ఇక ప్రస్తుతం ప్రభాస్ అభిమానులు తదుపరి సినిమాలపై అంచనాలు పెంచుకుంటున్నారు. ప్రభాస్ నెక్స్ట్ అయితే ఆదిపురుష్ సినిమాతో రాబోతున్నాడు. బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతి బరిలో నిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా రామాయణం కథ ఆధారంగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇక ఆదిపురుష్ కంటే కూడా అందరి ఫోకస్ ఎక్కువగా సలార్ సినిమాపైనే ఉంది. మాస్ యాక్షన్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పై అంచనాలు ఏ స్థాయిలో పెరుగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

Prabhas busy with prashanth neel salaar project shocking cost for interval block

అసలైతే ఈ సినిమాను ఈ ఏడాది సమ్మర్లో విడుదల చేయాలని అనుకున్నారు. కానీ కరోనా పరిస్థితుల కారణంగా సినిమా షూటింగ్ చాలా సార్లు వాయిదా పడాల్సి వచ్చింది. ఇక దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇప్పటికే సగానికిపైగా షూటింగ్ పనులను పూర్తి చేశాడు. ఇక మిగిలిన షూటింగ్ పార్ట్ ను వీలైనంత అంత త్వరగా పూర్తి చేసి రెగ్యులర్ ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టాలని అనుకుంటున్నారు. త్వరలోనే ఫస్ట్ లుక్ టీజర్ కూడా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు పూర్తిగా కేజిఎఫ్ సినిమాకి వర్క్ చేసిన యూనిట్ సభ్యులే వర్క్ చేస్తూ ఉండడం విశేషం. దర్శకుడు ప్రశాంత్ ఈ సినిమాలో ఇంటర్వెల్ యాక్షన్ సీన్లను చాలా గ్రాండ్గా చూపించబోతున్నట్లు సమాచారం. ఇంటర్వెల్ లో ఆ ఒక్క యాక్షన్ ఎపిసోడ్ కోసమే దాదాపు 20 కోట్ల వరకు ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తోంది.

హోంబల్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే మరొక ముఖ్యమైన పాత్ర కోసం బాలీవుడ్ కు చెందిన ఒక గ్లామరస్ బ్యూటీని సంప్రదించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపిస్తాడని కూడా ఆమధ్య టాక్ వచ్చిన విషయం తెలిసిందే. దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాను కూడా రెండు భాగాలుగా విడుదల చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక మొదటి భాగాన్ని వచ్చే ఏడాది సమ్మర్లో విడుదల చేసే చేస్తారట. మరి ఈ సినిమాతో ప్రభాస్ ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X