Project Kలో ప్రభాస్ కోసం సరికొత్త విలన్స్.. ఎవరో చూపిస్తూ వీడియో!

తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర నిర్మాణ సంస్థలో ఒకటిగా నిలిచింది వైజయంతీ మూవీస్. 1972లో స్థాపించిన ఈ నిర్మాణ సంస్థకు అధిపతి అశ్వనీ దత్ చలసాని అని తెలిసిన విషయమే. ఇటీవల కాలంలో అశ్వనీ దత్ తో పాటు ఆయన కుమార్తె స్వప్న దత్ కూడా నిర్మాణంలో పాలు పంచుకుంటున్నారు. ఈ బ్యానర్ నుంచి అనేక సినిమాలు విడుదలై బాక్సాఫీస్ వద్ద వసూళ్ల మోత మోగించాయి. ఇప్పుడు ఈ సంస్థ జూబ్లీ గోల్డెన్ మూవీగా వస్తోంది ప్రాజెక్ట్ కె. తాజాగా దీనికి సంబంధించిన రెండో మేకింగ్ వీడియోను సోషల్ మీడియా వేదికగా వదిలారు.

పాన్ ఇండియా హవా: జగదేక వీరుడు అతిలోక సుందరి, రాజకుమారుడు, స్టూడెంట్ నెంబర్ 1, ఇంద్ర, దేవదాస్, మహానటి, సీతా రామం వంటి బ్లాక్ బస్టర్స్ అందించిన నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్. తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర నిర్మాణ సంస్థగా పేరొందింది. అయితే ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో పాన్ ఇండియా హవా నడుస్తోన్న నేపథ్యంలో ఈ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మక రూపొందిస్తున్న సినిమా ప్రాజెక్ట్ కె.

Prabhas Nag Ashwin Project K Scratch 2 Raiders Making Video

భారీ అంచనాలు: మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పాన్ ఇండియా స్ట్రార్ ప్రభాస్ హీరోగా చేస్తున్న విషయం తెలిసిందే. అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, దిశా పటానీ వంటి బాలీవుడ్ స్టార్స్ నటిస్తున్న ప్రాజెక్టె కె మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. అందుకు తగినట్లుగానే మూవీలో నటీనటులు, దానికి సంబంధించిన అప్డేట్స్ ఉంటున్నాయి.

రైడర్స్ ఎవరు..: ఇటీవలే విడుదల చేసిన పోస్టర్ తో క్యూరియాసిటీ పెంచగా ఆ మధ్య స్క్రాచ్ వీడియో అంటూ సినిమా కోసం ఎంత కష్టపడ్డారో చూపించారు. అందులో ఒక చక్రాన్ని ఎలా తయారు చేశారో చూపించి ఆశ్చర్యపరిచారు. ఇప్పుడు తాజాగా అలాంటి మరొక మేకింగ్ వీడియోను స్క్రాచ్ ఎపిసోడ్ 2 పేరుతో వదిలారు. ఈ వీడియోలో రైడర్స్ ఎవరు అంటూ చర్చ జరుగుతుంది. ఒక్కొక్కరు ఒక్కోలా సమాధానం ఇస్తారు. అలా ఆసక్తి పెంచారు.

Prabhas Nag Ashwin Project K Scratch 2 Raiders Making Video

ప్రభాస్ కు విలన్స్: తాజాగా రిలీజ్ చేసిన స్క్రాచ్ ఎపిసోడ్ 2 వీడియోలో రైడర్స్ మేకింగ్ చూపించారు. గ్రాఫిక్స్ లో రైడర్స్ అనేవాళ్లను తయారు చేశారు. అలాగే షూటింగ్ లో ఎలా చేస్తున్నారో కూడా చూపించారు. ఇలా చూసే క్రమంలో రైడర్స్ అంటే విలన్స్ అని అర్థం అవుతుంది. కొంతమంది ప్రభాస్ తరఫున ఉండే సైన్యం అని కూడా చెప్పారు. కానీ ఫైనల్ గా చూసుకుంటే రైడర్స్ అంటే ప్రభాస్ కు విలన్లుగా ఉండనున్నారు.

ముఖ్యమైన పాత్రలుగా: ప్రాజెక్ట్ కె మూవీలో ప్రభాస్ ను ఢీ కొట్టే రైడర్స్ సూట్, క్యూస్టూమ్స్ ను ఈ వీడియోలో డిజైన్ చేసి చూపించారు. వీడియో చూస్తుంటే రైడర్స్ పాత్రలు ఇందులో ముఖ్యమైన పాత్ర పోషించేలా కనిపిస్తోంది. ఇదిలా ఉంటే వైజయంతీ మూవీస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ మూవీని దాదాపుగా రూ. 500 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X