పవన్ డిజాస్టర్ సినిమా గురించి డైరెక్ట్ గా ఆయనతోనే చెప్పేసిన ప్రియదర్శి.. పవర్ స్టార్ తో సడన్ మీటింగ్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే కేవలం జనాలకు మాత్రమే కాకుండా సినిమా ఇండస్ట్రీలో చాలామందికి ఇష్టమని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా కలుసుకునేందుకు కొంత మంది ఆర్టిస్టులు కూడా చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆయనతో ఒక్కసారి మాట్లాడిన చాలు అని సోషల్ మీడియాలో కూడా షేర్ చేసుకుంటూ ఉంటారు. రీసెంట్ గా ప్రముఖ కమెడియన్ ప్రియదర్శి కూడా పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా కలుసుకొని సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ చేశాడు. అంతేకాకుండా ఆయన తో కలిసి ఒక సినిమా గురించి మాట్లాడినట్లు చెప్పాడు.. కొన్ని ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

 సినిమాల కంటే కూడా

సినిమాల కంటే కూడా

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే కేవలం ఆయన అభిమానులకు మాత్రమే కాదు సినిమా పరిశ్రమలో ఉన్న చాలా మందికి కూడా చాలా ఇష్టం అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక విధంగా పవన్ కళ్యాణ్ తన సినిమాల కంటే కూడా తన వ్యక్తిగత మంచితనం తోనే చాలా మంది కి ఇష్టమైన హీరో గా మారిపోతున్నాడు. రాజకీయాల్లోకి గెలవకపోయినప్పటికీ కూడా ఎన్నో మంచి పనులు చేసే జనాలకు మరింత దగ్గరవుతున్నాడు.

పవన్ కళ్యాణ్ ను కలుసుకోవాలని..

పవన్ కళ్యాణ్ ను కలుసుకోవాలని..

ఇక పవన్ కళ్యాణ్ ను ప్రత్యేకంగా కలుసుకోవాలని చాలా మందిలో కోరిక ఉంటుంది ఇక గత కొంతకాలంగా కమెడియన్ ప్రియదర్శి కూడా పవన్ కళ్యాణ్ ను కలుసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాడని మొత్తానికి అతనికి ఇటీవల ఒక ప్రముఖ దర్శకుడి ద్వారా పవన్ కళ్యాణ్ ని కలిసే అవకాశం వచ్చింది. ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఫోటోలను పోస్ట్ చేస్తూ వివరణ ఇచ్చాడు.

 ఎటు చూసిన హడావిడి..

ఎటు చూసిన హడావిడి..

పవన్ కళ్యాణ్ ను కలుసుకున్న ప్రియదర్శి ఈ విధంగా వివరణ ఇచ్చారు.. ఎప్పటిలాగ సారధి స్టూడియోలో షూటింగకి వెళ్ళాను, కానీ ఆ రోజు మాత్రం ఎప్పటి లాగా లేదు. ఎటు చూసిన హడావిడి, అందరి కళ్ళలో ఏదో సందడి, అందరి నోట్లో ఒకటే మాట, పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు.. అని ప్రియదర్శి పేర్కొన్నాడు.

ఆ సినిమా గురించి..

ఆ సినిమా గురించి..


అయితే ప్రియదర్శి పవన్ కళ్యాణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లో ఒకటైన జానీ సినిమా గురించి కూడా మాట్లాడడం జరిగిందట. ఆ సినిమా ఫెయిల్ అయినప్పటికీ కూడా చాలామంది ఫ్యాన్స్ కు ఇష్టమైన సినిమా. ఇక ప్రియదర్శి కూడా అదే తరహాలో లైక్ చేశాడట.. వారితో ఒక మాటైనా మాట్లాడాలి, వారు తీసిన చిత్రం "జానీ" ఎంతగా నచ్చిందో చెప్పడానికి రోజంతా ఎదురుచూశాను.. అని పేర్కొన్నాడు.

హరీష్ శంకర్ అన్న వల్ల..

హరీష్ శంకర్ అన్న వల్ల..

ఇక దర్శకుడు హరీష్ శంకర్ అన్న వల్ల ఆ కోరిక తీరింది అంటూ అందుకు ప్రత్యేక కృతజ్ఞతలు అన్న అని.. కళ్యాణ్ గార్ని కలిసి మాట్లాడడం ఒక మర్చిపోలేని అనుభూతి... అని ప్రియదర్శి ఎమోషనల్ గా వివరణ ఇచ్చారు. అందుకు సంబంధించిన ఫొటోలను కూడా ప్రియదర్శి తన ట్విట్టర్ లో షేర్ చేసుకున్నారు.

షూటింగ్ లో బిజీగా..

షూటింగ్ లో బిజీగా..


ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సారధి స్టూడియోలో హరిహర వీరమల్లు షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఆ సినిమాలో ఒక వీర యోధుడి పాత్రలో నటిస్తున్న పవన్ ఉన్న వారి నుంచి దోచుకొని లేని వారికి ఇచ్చే రాబిన్ హుడ్ తరహా పాత్రలో మెప్పించబోతున్నట్లు సమాచారం. ఇక హరిహర వీరమల్లు సినిమా అనంతరం పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. భవదియుడు భగత్ సింగ్ అనే ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా త్వరలోనే స్టార్ట్ చేయనున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X