ఇంటర్వెల్ బ్యాంగ్‌లో ఆర్ఆర్ఆర్.. ఎన్టీఆర్ ఒక్కడే! చెర్రీ మాత్రం..
రాజమౌళి ఎప్పుడైతే 'ఆర్ఆర్ఆర్' ప్రాజెక్ట్ ప్రకటించారో అప్పటి నుంచే మీడియాలో ఓ రేంజ్ చర్చలు ఊపందుకున్నాయి. బడా నిర్మాత డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తుండటం, పైగా యంగ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ కలిసి నటిస్తుండటం ఈ సినిమాపై ఓ రేంజ్ అంచనాలు క్రియేట్ చేశాయి. ఈ నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ షూటింగ్ అప్‌డేట్స్ పట్ల ఆసక్తిగా ఉంది ప్రేక్షక లోకం. కాగా అనూహ్యంగా రెండు నెలలు షూటింగ్‌కి బ్రేక్ తీసుకున్న చిత్రయూనిట్.. కొద్ది రోజుల క్రితమే తిరిగి సెట్స్ పైకి వచ్చింది.
ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ తమ తమ గాయాల నుంచి పూర్తిగా కోలుకోవడంతో ఇక షూటింగ్ నాన్ స్టాప్ గా చేయాలని ఫిక్స్ అయ్యారు రాజమౌళి. ఈ మేరకు ప్రస్తుతం హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు జక్కన్న. ఈ షూటింగ్‌లో ఏకంగా 1500 మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొనడం విశేషం. ఇప్పుడు షూట్ చేస్తున్న సన్నివేశాలు చిత్రంలో ఇంటర్వెల్ కు ముందు వస్తాయని తెలుస్తోంది. అయితే ఈ షూటింగ్ లో కేవలం జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే పాల్గొంటున్నారు. ఉపాసనతో కలిసి ఫారెన్ టూర్ వేసిన రామ్ చరణ్.. మరి కొద్ది రోజుల్లో ఎన్టీఆర్ అండ్ టీమ్ తో జాయిన్ కానున్నారు.

హైదరాబాద్ షెడ్యూల్ పూర్తికాగానే అహ్మదాబాద్ వెళ్లనుంది ఆర్ఆర్ఆర్ టీమ్. హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో అక్కడి చారిత్రాత్మక ప్రదేశాల్లో కీలక ఘట్టాలు షూట్ చేయనున్నారట. ఇక రామ్ చరణ్ సరసన నటించనున్న బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ రెడీగా ఉన్నప్పటికీ ఎన్టీఆర్ సరసన నటించే హీరోయిన్ విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు రోల్ పోషిస్తున్నారు. ఎప్పటిలాగే జక్కన్న జోడీ కీరవాణి సంగీతం సమకూర్చుతున్నారు. భారీ అంచనాల నడుమ ఈ చిత్రాన్ని జులై 30న విడుదల చేయనున్నారు.


Click it and Unblock the Notifications











