RRRకి మరో బ్రేక్.. ఎన్టీఆర్, చెర్రీలకు రెస్ట్.. ఈ సారి కారణమేంటంటే!
డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక మూవీ RRR. మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా రూపొందుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది జులై 30వ తేదీన విడుదల చేస్తామని ప్రకటించారు జక్కన్న. ఈ మేరకు శరవేగంగా షూటింగ్ జరుపుతూ వస్తున్నారు. కానీ అనుకోని విధంగా RRR కి బ్రేకులు పడుతూ వస్తున్నాయి. ఇప్పటికే చాలాసార్లు షూటింగ్ కి బ్రేక్ తీసుకున్న RRR టీమ్ తాజాగా మరో షార్ట్ బ్రేక్ తీసుకుంది. ఆ వివరాలు చూస్తే..

వారం రోజుల పాటు విరామం
ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న RRR సినిమా షూటింగ్ కి వారం రోజుల పాటు విరామం ఇస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా తెలిపింది ఆ చిత్ర నిర్మాణ డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్. ''భీం, రామరాజులతో షూటింగ్ సక్సెస్ ఫుల్ గా జరుగుతోంది. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుంటున్నాం. వారంలో తిరిగి సెట్స్ పైకి వస్తాం'' అని ట్వీట్ లో పేర్కొన్నారు.

ఎన్టీఆర్, చెర్రీలకు రెస్ట్
ప్రస్తుతం RRR సినిమా మూడో షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటోంది. రామోజీ ఫిలింసిటీలో వేసిన భారీ సెట్ లో ఈ షూటింగ్ నిర్వహిస్తున్నారు. అయితే తాజాగా ప్రకటించిన బ్రేక్ తో ఈ చిత్రంలో నటిస్తున్న ఎన్టీఆర్, చెర్రీలకు కాస్త రెస్ట్ దొరికింది. ఈ వారం రోజుల్లో వీరిద్దరూ రీ ఫ్రెష్ అయి మరింత ఎనర్జీతో తిరిగి సెట్స్ పైకి రానున్నారు. ఈ సినిమా చేస్తూనే 'సైరా' నిర్మాణ పనుల్లో బిజీగా ఉన్న రామ్ చరణ్‌కి ఈ బ్రేక్ బాగా ఉపయోగకరం అని తెలిసింది.

హీరోయిన్లు దూరం.. ప్రధాన సమస్య
RRR చిత్రయూనిట్‌ని వెంటాడుతున్న ప్రధాన సమస్య సినిమా హీరోయిన్స్. ఎన్టీఆర్ సరసన నటించనున్న డైసీ ఎడ్గార్ జోన్స్ ముందుగానే ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోగా, రామ్ చరణ్ సరసన నటించనున్న ఆలియా భట్ తీరా షూటింగ్ సమయానికి అనారోగ్యం పాలైంది. దీంతో హీరోయిన్స్ అనే అంశమే RRR కి పెద్దగా కలిసి రావడం లేదని అంటున్నాయి ఫిలింనగర్ వర్గాలు. ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోయిన్ కోసం వేట ప్రారంభించారు జక్కన్న.

RRR మూవీ
చారిత్రక నేపథ్యంలో ఎన్నో హంగులు జోడించి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని RRR సినిమా షూట్ చేస్తున్నారు రాజమౌళి. చిత్రంలో కొమురం భీం పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామ రాజు పాత్రలో రామ్ చరణ్ నటిస్తున్నారు. ఇంకా బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్, కోలీవుడ్ క్యారెక్టర్ యాక్టర్ సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు.


Click it and Unblock the Notifications











