RC 16: బుచ్చిబాబుతో రామ్ చరణ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ముహూర్తం ఫిక్స్.. మొదలయ్యేది అప్పుడే!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తన 15వ సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా అనంతరం బుచ్చిబాబుతో మరో పాన్ ఇండియా సినిమా చేయబోతున్నాడు. ఇక ఆ ప్రాజెక్టు గురించి రకరకాల కథనాలు అయితే వినపడుతున్నాయి. మొదట దర్శకుడు బుచ్చిబాబు అదే కథను జూనియర్ ఎన్టీఆర్కు వినిపించాడు అని అయితే ఆ కథను అతను రిజెక్ట్ చేయడంతో ఇప్పుడు అందులోకి రాంచరణ్ వచ్చాడు అని కథనాలు వస్తున్నాయి.

ఇక నేడు బుచ్చిబాబు పుట్టినరోజు కావడంతో రామ్ చరణ్ తేజ్ ప్రత్యేకంగా బుచ్చిబాబుని కలుసుకుని తన విషెస్ ను అందించాడు. అయితే బుచ్చిబాబు చేయబోయే ప్రాజెక్టు గురించి కూడా రామ్ చరణ్ తేజ్ చర్చలు జరిపినట్లు సమాచారం. స్క్రిప్ట్ పనులు అయితే ఇంకా పూర్తికాలేనట్లుగా తెలుస్తోంది. పూర్తి స్థాయిలో కథ మొత్తం సిద్ధమైన తర్వాతనే ఈ ప్రాజెక్టును అధికారికంగా మొదలు పెట్టాలని అనుకుంటున్నారు.

Ram charan bucchi babu upcoming project RC 16 Latest shooting update

అయితే లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్ ప్రకారం అయితే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను ఈ ఏడాది చివరలో స్టార్ట్ అయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇంకా చాలా బ్యాలెన్స్ ఉంది. కాబట్టి రామ్ చరణ్ ఇప్పట్లో మరొక ప్రాజెక్టును మొదలుపెట్టాలి అంటే అంత సామాన్యమైన విషయం కాదు. కాబట్టి అప్పటివరకు బుచ్చిబాబు ఇంకా తన కథను పవర్ ఫుల్ గా డెవలప్ చేసుకోమని రామ్ చరణ్ సలహా ఇచ్చినట్లు సమాచారం.

ఇక బుచ్చిబాబు కూడా రామ్ చరణ్ తోనే తన రెండవ సినిమా చేయాలి అని ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. ఇక అన్ని కుదిరితే ఈ ఏడాది నవంబర్లో సినిమా షూటింగ్ మొదలు కావచ్చు అని తెలుస్తోంది. ఇక మరోవైపు రాంచరణ్ శంకర్ దర్శకత్వంలో చేస్తున్న 15వ సినిమా షూటింగ్ ఈ ఏడాది దసరా సమయానికి పూర్తిచేసి సినిమాను మాత్రం 2024 సంక్రాంతికి విడుదల చేయాలని అనుకుంటున్నాడు. ఇక ఆ తర్వాత బుచ్చిబాబు సినిమాను కూడా అదే ఏడాది చివరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావచ్చు అని సమాచారం. అంటే వచ్చే ఏడాది రామ్ చరణ్ నుంచి రెండు సినిమాలు ఉంటాయి అని చెప్పవచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X