చెర్రీ, ఎన్టీఆర్‌లకు రాజమౌళి సూచన.. రెడీ అయినట్లేనా?

బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ సినిమా 'ఆర్ఆర్ఆర్'. డీవీవీ దానయ్య సమర్పణలో తెరకెక్కుతున్న ఈ భారీ మల్టీస్టారర్ మూవీ యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రాంచరణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్నారు. బాలీవుడ్ భామ ఆలియా భట్ ఒక హీరోయిన్‌గా సెలెక్ట్ అయింది. గత కొద్దిరోజులుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా యూనిట్.. ఈ మధ్య షూటింగ్‌కి కాస్త బ్రేక్ ఇచ్చారు. అయితే తాజాగా సమాచారం మేరకు ఇక బ్రేక్ చాలు షూటింగ్‌కి రెడీ అవ్వండి అని రాజమౌళి చిత్రయూనిట్‌తో అన్నారని తెలుస్తోంది. ఈ మేరకు యూనిట్ తారక్, చెర్రీలతో పాటు అంతా రెడీ అవుతున్నారని సమాచారం.

రామ్ చరణ్ తేజ్‌కి గాయం

రామ్ చరణ్ తేజ్‌కి గాయం

ఆర్ఆర్ఆర్ షూటింగ్ శరవేగంగా షూటింగ్ జరుగుతున్న సమయంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గాయపడటంతో సినిమా షూటింగ్‌కి కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చారు. ఆ తర్వాత ఎన్టీఆర్ కూడా గాయపడటం కారణంగా మరోసారి షూటింగ్ కి బ్రేక్ పడింది. ప్రస్తుతం ఈ ఇద్దరూ కోలుకోవడంతో మరో షెడ్యూల్ షూటింగ్ మొదలు పెట్టేందుకు రెడీ అయ్యారట జక్కన్న.

హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో

హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో

ఆర్ఆర్ఆర్‌కి సంబంధించి ఇప్పటికే రెండు భారీ షెడ్యూల్స్ పూర్తి చేసిన జక్కన్న.. తాజాగా మరో షెడ్యూల్ షూటింగ్ కోసం అంతా సిద్ధం చేశారట. ఈ షెడ్యూల్ హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో భారీ ఎత్తున జరగనుందని తెలుస్తోంది. అక్కడ ప్రత్యేకంగా వేసిన ఓ సెట్‌లో భారీ యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కించనున్నారట.

ఆలియా భట్ ఎంట్రీ

ఆలియా భట్ ఎంట్రీ

బాలీవుడ్ భామ ఆలియా భట్ ఈ సినిమాతో తెలుగు తెరపై అడుగుపెడుతోంది. చిత్రంలో రామ్ చరణ్ సరసన ఆలియా నటిస్తోంది. ఇప్పటి వరకు షూటింగ్‌లో పాల్గొనని ఆమె తాజాగా జరగబోయే షెడ్యూల్‌లో ఎంట్రీ ఇవ్వనుంది. చెర్రీ, ఆలియా మధ్య కీలక సన్నివేశాలు ఈ షెడ్యూల్‌లో ఫినిష్ చేయనున్నారు.

ఎన్టీఆర్ హీరోయిన్ కోసం వేట

ఎన్టీఆర్ హీరోయిన్ కోసం వేట

చిత్రంలో చెర్రీ సరసన ఆలీయాను అదేవిధంగా ఎన్టీఆర్ సరసన బ్రిటిష్ భామ డైసీ ఎడ్గార్ జోన్స్‌ని సెలెక్ట్ చేశారు రాజమౌళి. అయితే కొన్ని కారణాల వల్ల డైసీ తప్పుకోవడంతో ఎన్టీఆర్ సరసన మరో హీరోయిన్ కోసం వేట ప్రారంభించారు. ఈ నేపథ్యంలో కీర్తి సురేష్, శ్రద్ద కపూర్ పేర్లు బయటకు వచ్చాయి. కానీ క్లారిటీ రాలేదు.

ఆర్ ఆర్ ఆర్ మూవీ

ఆర్ ఆర్ ఆర్ మూవీ

హిస్టారికల్ నేపథ్యంలో భారీ ఎత్తున ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు రాజమౌళి. చిత్రంలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తుండగా, ఎన్టీఆర్ కొమురం భీం రోల్ చేస్తున్నారు. భారీ అంచనాల నడుమ 2020 జులై నెలలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

More from Filmibeat

Read more about: rrr ram charan rajamouli shooting
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X