రాంచరణ్, బోయపాటి సినిమా సీన్లు లీక్.. ఇంటర్నెట్‌లో ఫొటోలు వైరల్!
రంగస్థలం బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత మెగా పవర్‌స్టార్ రాంచరణ్ నటిస్తున్న చిత్ర షూటింగ్ జోరుగా సాగుతున్నది. రాంచరణ్ కెరీర్‌లో పన్నెండో చిత్రం కావడంతో ఆర్సీ 12 అని పిలుచుకొంటున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకొంటున్నది. ప్రస్తుతం చిత్రీకరిస్తున్న యాక్షన్ సీన్లు బయటకు రావడంతో చిత్ర యూనిట్ షాక్ గురైంది.

పకడ్బందీగా రాంచరణ్ షూట్
రాంచరణ్, బోయపాటి కాంబినేషన్‌లో వస్తున్న చిత్ర షూటింగ్‌ను పకడ్బందీగా తెరకెక్కిస్తున్నారు. చిత్రానికి సంబంధించిన వీడియోలు గానీ, ఫొటోలు గానీ బయటకు రాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశార. అయినా ఈ సినిమా ఫైట్ సీన్లు సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. దాంతో చిత్ర యూనిట్ మరోసారి గట్టి చర్యలు తీసుకొంటున్నట్టు సమాచారం.

మరింత క్రేజ్ పెంచిన లీక్ సీన్లు
లీకైన ఫొటోల ప్రకారం చేతిలో ఓ విభిన్నమైన ఆయుధంతో రాంచరణ్ ఫైట్ చేస్తున్నాడు. దాంతో ఫొటోలు లీక్‌తో కొంత ఆందోళన గురైనప్పటికీ ఈ సినిమా స్టిల్స్ ఫ్యాన్స్‌లో మరింత క్రేజ్, అంచనాలను పెంచాయి. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రం సంక్రాంతికి రిలీజ్ కానున్నది.

త్వరలోనే ఫస్ట్‌లుక్, టైటిల్
ఆర్సీ12 చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్, టైటిల్ అనౌన్స్‌మెంట్ త్వరలోనే అభిమానుల ముందుకు తెచ్చేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నది. నవంబర్ నెలఖారుకు సినిమాను పూర్తి చేసే ఆలోచనలో ఉన్నారు. ఆ తర్వాత వేగంగా ప్రమోషన్ చేసేందుకు ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు.

విలన్‌గా హీరో వివేక్ ఓబెరాయ్
బోయపాటి, రూపొందుతున్న ఈ చిత్రంలో రాంచరణ్ సరసన భరత్ అనే నేను ఫేమ్ కైరా అద్వానీ నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో వివేక్ ఓబెరాయ్ విలన్‌గా నటించడం విశేషంగా మారింది. ప్రశాంత్, ఆర్యన్ రాజేష్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











