RRRలో రాంచరణ్ పోలీస్ స్టేషన్ బయటపడింది.. ఇక అనుమానం లేదు, ఫొటోస్ వైరల్!
మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలసి నటిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. రాజమౌళి ఈ చిత్రంలో రాంచరణ్, ఎన్టీఆర్ ని సరికొత్తగా చూపించబోతున్నాడు. ఈ చిత్ర కథ గురించి అనేక ఊహాగానాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. కానీ చిత్ర యూనిట్ మాత్రం ఏ విషయాన్నీ అధికారికంగా ప్రకటించలేదు. తాజాగా వైరల్ అవుతున్న ఆర్ఆర్ఆర్ లొకేషన్ స్టిల్స్ బట్టి ఈ చిత్ర నేపథ్యం గురించి ఓ అంచనాకు వచ్చేయొచ్చు.

జరుగుతున్న ప్రచారం ఇదే
ఆర్ఆర్ఆర్ చిత్రం ద్వారా రాజమౌళి బ్రిటిష్ కాలం నాటి పీరియాడిక్ డ్రామాని ఎంచుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఇందులో రాంచరణ్ బ్రిటిష్ ప్రభుత్వంలో పనిచేసే పోలీస్ అధికారిగా, ఎన్టీఆర్ బందిపోటుగా కనిపించబోతున్నట్లు ఇప్పటి వరకు ప్రచారం జరిగింది. అలాగే ఈచిత్రంలో పునర్జన్మల ప్రస్తావన కూడా ఉంటుందట. తాజాగా ఈ వార్తలకు బలాన్నిచ్చే ఆధారం బయట పడింది.

అనుమానం లేదు
ఆర్ఆర్ఆర్ చిత్ర లొకేషన్ ఫోటోలు కొన్ని లీకై సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. బ్రిటిష్ కాలం నాటి పోలీస్ స్టేషన్ సెట్ కి సంబంధించిన ఫోటోలు అవి. పోలీస్ స్టేషన్ ముందు బ్రిటిష్ జెండాగా కూడా ఉండడంతో ఈ చిత్ర నేపథ్యంలో అంతా ఓ నిర్ధారణకు వచ్చేయొచ్చు. ఆర్ఆర్ఆర్ చిత్రం స్వాతంత్ర పోరాటం నేపథ్యంలో తెరకెక్కబోతోంది అనేది ఈ ఫోటోలు ద్వారా ఖరారైపోయింది. ఈ చిత్రంలో యాక్షన్, ఎన్టీఆర్, రాంచరణ్ పాత్రలు ఎలా ఉంటాయో వేచి చూడాలి.

యాక్షన్ సన్నివేశాలు
ప్రస్తుతం రాజమౌళి రాంచరణ్ ఎంట్రీకి సంబందించిన భారీ ఫైట్ సీన్ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుగుతోంది. రాంచరణ్ పనిచేసే పోలీస్ స్టేషన్ పేరు ఆనంగ్ పూర్. ఈ ఫైట్ సీన్ పూర్తయ్యే వరకు రాజమౌళి ఎన్టీఆర్ కు షూటింగ్ నుంచి బ్రేక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలో ఎన్టీఆర్ కూడా షూటింగ్ లో జాయిన్ కానున్నాడు.

300 కోట్ల బడ్జెట్
ప్రముఖ నిర్మాత దానయ్య ఈ చిత్రం కోసం 300 కోట్ల భారీ బడ్జెట్ వెచ్చిస్తున్నారు. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రాన్ని కథ అందిస్తున్నారు. ఇక రాంచరణ్, ఎన్టీఆర్ సరసన నటించే హీరోయిన్ల విషయంలో సందిగ్దత కొనసాగుతోంది. కొందరు బాలీవుడ్ హీరోయిన్లతో చిత్ర యూనిట్ సంప్రదింపులు జరుపుతున్నారు. పరిణీతి చోప్రా, అలియా భట్ లాంటి స్టార్ హీరోయిన్ల పేర్లు వినిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











