ఆ పార్టీలోకి రామ్ చరణ్.. కర్నూలులో ప్రచారం.. బయటకొచ్చిన ఫొటోలు
మెగాస్టార్ చిరంజీవి కుమారుడిగా సినిమాల్లోకి అడుగు పెట్టినా.. తనదైన చిత్రాలను చేస్తూ కెరీర్ ఆరంభం నుంచే ప్రత్యేకమైన ఇమేజ్‌తో దూసుకుపోతోన్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. చాలా తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిపోయిన అతడు.. ఫలితాలను బేరీజు వేసుకోకుండా వరుసగా సినిమాలు చేస్తోన్నాడు. తద్వారా క్రమంగా తన ఫాలోయింగ్‌ను, మార్కెట్‌ను పెంచుకుంటోన్నాడు.
ఈ క్రమంలోనే గత ఏడాది వచ్చిన RRR (రౌద్రం రుధిరం రణం) అనే మూవీతో చరణ్ మరో ఇండస్ట్రీ హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. అలాగే, ఈ మూవీతో తన క్రేజ్ అంతర్జాతీయ స్థాయికి పెంచుకున్నాడు. అయితే, తర్వాత వచ్చిన 'ఆచార్య' మాత్రం పరాజయం పాలైంది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం లెజెండరీ డైరెక్టర్ శంకర్‌తో కలిసి ఓ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతూ వస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన 50 శాతానికి పైగా టాకీ పార్ట్ కూడా విజయవంతంగా పూర్తి అయింది.
అంతేకాదు, తాజాగా హైదరాబాద్‌లోని చార్మినార్ దగ్గర కూడా చిత్రీకరణ జరిపారు. ఇక, ఇప్పుడు ఈ సినిమా షూటింగ్‌ను కర్నూలుకు షిఫ్ట్ చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ చిత్రం షూటింగ్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలు బయటకు వచ్చేశాయి. అలాగే, ఓ ఆసక్తికరమైన విషయం కూడా లీకైంది.
ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ చిత్రంలో రామ్ చరణ్ డుయల్ రోల్ చేస్తున్నాడన్న న్యూస్ క్లారిటీ వచ్చింది. అలాగే, ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో అతడు ఓ పార్టీకి చెందిన రాజకీయ నాయకుడిగా కనిపిస్తాడని అన్నారు. తాజాగా లీకైన ఫొటోల్లో అతడు కర్నూలులోని కొండారెడ్డి బురుజు దగ్గర 'అభ్యుదయం' అనే రాజకీయ పార్టీ తరపున ప్రచారం చేస్తున్నాడు. ఇందులో రామ్ చరణ్‌తో పాటు శ్రీకాంత్, రాజీవ్ కనకాల కూడా ఉన్నారు. ఇక, ఈ షూటింగ్ గురించి తెలుసుకుని మెగా అభిమానులు వేల సంఖ్యలో వచ్చినట్లు తెలిసింది.

ఈ మూవీలో రామ్ చరణ్‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాణీ నటిస్తోంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అలాగే, ఈ సినిమాకు ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. శ్రీకాంత్, జయరాం, అంజలి తదితరులు కీలక పాత్రలను చేస్తున్నారు. ఈ సినిమాకు 'సిటిజన్' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు.


Click it and Unblock the Notifications











