ఎన్టీఆర్ బయోపిక్: లీకైన రానా లుక్.. అచ్చం చంద్రబాబులా!
దగ్గుబాటి రానా బాహుబలి, ఘాజి వంటి చిత్రాలతో జాతీయ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్నాడు. విభిన్న చిత్రాలు ఎంచుకుంటూ దూసుకుపోతున్నాడు. ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో రానా ముఖ్యమంత్రి చంద్రబాబు పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ జీవితంలో చంద్రబాబు చాలా కీలక పాత్ర పోషించారు.
ఆ పాత్రలో రానా నటిస్తుండడంతో ఉత్కంఠ నెలకొని ఉంది. యువ రాజకీయ నేతగా చంద్రబాబు ఎదిగిన వైనం, ఆ తరువాత ఎన్టీఆర్ కు అల్లుడిగా మారిన ఆసక్తికరమైన అంశాలు ఈ చిత్రంలో చూపించబోతున్నారు. తాజాగా చంద్రబాబు లుక్ లో షూటింగ్ స్పాట్ లో ఉన్న రానా ఫోటో లీక్ అయింది.

ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వైట్ అండ్ వైట్ డ్రెస్ లో రానా చంద్రబాబుని గుర్తుచేస్తున్నాడు. రానా బాడీ లాంగ్వేజ్ చూస్తే ఆశ్చర్యం వేయక మానదు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పాత్రలో మలయాళీ బ్యూటీ మంజిమ మోహన్ నటిస్తోంది. బాలయ్య ఎన్టీఆర్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. క్రిష్ ఈ చిత్రానికి దర్శకుడు. సంక్రాంతికి చిత్రాన్ని విడుదల చేయనున్నారు.


Click it and Unblock the Notifications











