లంగావోణిలో అదిరిపోయిన హీరోయిన్.. లొకేషన్ నుంచి ఫోటోలు లీక్.. నెట్టింట హల్‌చల్
రష్మిక మందాన్న.. ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. మొదటి సినిమాతోనే లుక్స్‌తో పాటు, నటనతోనూ అందరినీ ఆకర్శించింది. రష్మీక తెలుగులో స్టార్ హీరోయిన్‌గా ఎదిగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయని ఆ సమయంలో కొందరు జోస్యం చెప్పేశారు. వారి భవిష్యవాణి కూడా ఫలించింది. రెండో సినిమా గీతగోవిందంతో మరోసారి ప్రేక్షకుల హృదయాలను దోచేసింది.

గీత పాత్రలో జీవించిన రష్మిక
ఛలో సినిమా ఇచ్చిన హిట్.. మరిచిపోక ముందే గీతగోవిందం రూపంలో మరో బ్లాక్ బస్టర్ హిట్ వచ్చేసింది. ఈ మూవీ ఒకరకంగా ఫీమేల్ ఓరియెంటెడ్‌లానే అనిపిస్తుంది. హీరోను డామినేట్ చేసే ఈ పాత్రలో గీతగా రష్మిక టాలీవుడ్ ప్రేక్షకులను ఇట్టే ఆకర్శించింది. ఈ మూవీతో రష్మిక స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది.

వరుస ఆఫర్లతో బిజీ బిజీ
==గీతగోవిందం సినిమా మంచి విజయం సాధించాక వరుస ఆఫర్లు రష్మికను ఉక్కిరిబిక్కిరి చేశాయి. అయినా అవేవీ పట్టించుకోకుండా మళ్లీ విజయ్ దేవరకొండతో డియర్ కామ్రేడ్ చిత్రంలో నటించింది. అయితే ఈ సినిమా ఆశించిన మేరకు విజయం సాధించలేదు. కానీ బాబీ పాత్రలో విజయ్, లిల్లీ పాత్రలో రష్మికకు ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారు.

ప్రస్తుతం మహేష్ బాబు సరసన
ఏ హీరోయిన్‌కు అయినా టాలీవుడ్‌లో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన నటించాలనే డ్రీమ్ ఉంటుంది. అయితే అలాంటి డ్రీమ్ రష్మికకు ఇండస్ట్రీకి వచ్చిన కొద్ది రోజుల్లనే తీరింది. రష్మిక మంచి హిట్ల మీదు ఫుల్ స్వింగ్‌లో ఉండగా.. మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు చిత్రంలో హీరోయిన్‌గా ఫిక్స్ అయింది. ఇక ఈ సినిమాలో మహేష్ సరసన ఆడిపాడేందుకు సిద్దమైంది.

వైరలవుతోన్న పిక్స్..
మహేష్‌తో ఆడిపాడేందుకు రష్మిక కేరళ వెళ్లింది. అక్కడే వీరిద్దరి మీద పాటను షూట్ చేయబోతోన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కొన్ని స్టిల్స్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. లంగావోణిలో ఉన్న రష్మిక ఫోన్ ఆపరేట్ చేయడంలో మునిగిపోయి బిజీగా ఉంది. మరొక ఫోటోలో కొంటెగా చూస్తూ ఫ్యాన్స్‌కు పిచ్చెక్కేలా చూస్తోంది. మొత్తానికి లంగావోణిలో ఉన్న రష్మికను చూస్తే అచ్చ తెలుగమ్మాయిలా ఉందని కామెంట్లు చేస్తున్నారు.

బన్నీ, సుకుమార్ మూవీలోనూ..
పెద్ద హీరోల సినిమాల్లో నటిస్తూ తన రేంజ్‌ను పెంచుకుంటోంది రష్మిక. ఓ వైపు మహేష్ బాబు సినిమాలో నటిస్తూనే మరోవైపు స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, లెక్కల మాష్టారు సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రంలో హీరోయిన్‌గా ఓకే అయింది. చూస్తుంటే తన రేంజ్ ఎక్కడికో వెళ్లేలా కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











