Rashmika Mandanna సునామీని మించిన కష్టాలు.. కొండంత ధైర్యంతో.. అనుభవాలను షేర్ చేసిన రష్మిక
భారతీయ సినిమాలో ప్రభావవంతమైన పాత్రలతో రష్మిక మందన్న తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకొంటున్నాయి. గీతా గోవిందం, పుష్ప, యానిమల్ సినిమాలు ఆమె ప్రతిభకు అద్దంపట్టాయి. తాజాగా రిలీజైన యానిమల్ సినిమాలోని గీతాంజలి పాత్రలో ఒదిగిపోయిన విధానం మరింత మంది అభిమానులను ఆమెకు తెచ్చి పెట్టింది. అలాంటి పాత్ర గురించి చెబుతూ.. యానిమల్ మూవీ షూటింగులో ఫోటోలను షేర్ చేస్తూ..
నా దృష్టిలో గీతాంజలి అంటే.. ఒకే వ్యాక్యంలో క్లారిటీ ఇచ్చేస్తాను. ఆమె ఇంటిలో కుటుంబాన్ని ఒక్కటిగా ఉంచే అమ్మాయి. ఆమె మనసు స్వచ్చమైనది. వాస్తవికతకు దగ్గరగా జీవిస్తుంది. మనసులో ఎలాంటి ఫిల్టర్లు ఉండవు. పక్కాగా ముతక మనిషిగా ఉంటుంది అని యానిమల్‌లోని తన పాత్ర గురించి రష్మిక మందన్న చెప్పింది.

ప్రస్తుత జనరేషన్‌లో యాక్టర్‌గా గీతాంజలి పాత్రకు సంబంధించిన భావాల గురించి నాకు నేను ప్రశ్నించుకొంటాను. సెట్లో నా డైరెక్టర్ నాతో కథ చెప్పినప్పుడు.. రణ్ విజ, గీతాంజలి మద్య ఉండే ప్రేమ, జీవితం పట్ల వారి తపన గురించి చెప్పే వారు. అలాగే వారి కుటుంబాల పట్ల ఉండే నిబద్దత గురించి వివరించారు అని రష్మిక వెల్లడించింది.
రణ్ విజయ్ ప్రపంచంలో అధికంగా హింస, గాయాలు, భరించలేనంత బాధ ఉంటుంది. అలాంటి విజయ్ జీవితంలో శాంతిని, నమ్మకాన్ని, ప్రశాంతతను తెచ్చే బాధ్యత గీతాంజలిపై ఉంటుంది. ప్రతీ నిమిషం తన భర్త, పిల్లలు సురక్షితంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తుంది. తన ముందు ఉండే సునామీ లాంటి వాతావరణానికి ఎదురుగా ఓ కొండలా నిలుచుంటుంది అని సందీప్ చెప్పిన విషయాలను రష్మి తన అభిమానులతో పంచుకొన్నది.

నా దృష్టిలో గీతాంజలి గురించి ఆలోచిస్తే.. ఫ్యామిలీకి అండగా, బలంగా నిలిచే స్టాంగ్ ఉమెన్. ఆ పాత్ర మాదిరిగానే నేను కూడా ఆలోచించడం మొదలుపెట్టాను. ఇలాంటి గొప్ప పాత్రను ఇచ్చిన యానిమల్ యూనిట్‌కు ధన్యవాదాలు. అలాగే నాపై ప్రేమను కురిపిస్తున్న ప్రతి ఒక్కరికి. ప్రతీ సినిమాలో కష్టపడి నటించేలా ఇన్సిపిరేషన్ ఇస్తున్న వారికి ధన్యవాదాలు, మీ అందరికి ప్రేమతో కూడిన కౌగిలి ఇస్తున్నాను అని రష్మిక మందన్న చెప్పారు.
యానిమల్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా భారీ స్పందన లభిస్తున్నది. ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించిన రణ్‌బీర్ కపూర్, బాబీ డియోల్, రష్మిక మందన్న, అనిల్ కపూర్, తృప్తి డిమ్రీ పాత్రలకు విశేష ఆదరణ దక్కుతున్నది. గీతాంజలి పాత్ర ద్వారా అందం, ఫెర్ఫార్మెన్స్‌తో హీరోయిన్‌గా మరో మెట్టు ఎక్కిందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.


Click it and Unblock the Notifications











