Waltair Veerayya: చిరంజీవిని అరెస్ట్ చేసిన రవితేజ.. 'వాల్తేరు వీరయ్య' లీక్ డ్ వీడియో వైరల్

మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఓవైపు సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటూనే మరోవైపు టాలీవుడ్ సమస్యల పరిష్కారం కోసం పాటుపడుతుంటారు. సుమారు నాలుగు దశాబ్దాలుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో తన హవాను చూపిస్తూ యంగ్ హీరోలకో ఏమాత్రం తీసిపోని ఎనర్జీతో దూసుకుపోతున్నారు. ఇటీవల ఆచార్యతో పరాజయం పొందిన చిరంజీవి వరుస పెట్టి సినిమాలతో బిజీగా ఉన్నారు. అక్టోబర్ 5న గాడ్ ఫాదర్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉండగానే మరోవైపు వాల్తేరు వీరయ్య మూవీ చిత్రీకరణలో పాల్గొంటున్నారు. దానికి సంబంధించిన ఓ లీక్ డ్ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

ఏమాత్రం తగ్గకుండా వరుసపెట్టి..

ఏమాత్రం తగ్గకుండా వరుసపెట్టి..

దాదాపు నాలుగు దశాబ్ధాలుగు తెలుగు చిత్రసీమలో తన హవాను చాటుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా వరుసపెట్టి సినిమాలు చేస్తూ గట్టి పోటీ ఇస్తున్నారు. అంతేకాకుండా ఏక కాలంలో సినిమాలు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఇటీవల ఆయన తనయుడు రామ్ చరణ్ తో కలిసి నటించిన ఆచార్య మూవీ అంతగా హిట్ కాలేదన్న విషయం తెలిసిందే.

హిట్ ప్లాప్ అంటూ..

హిట్ ప్లాప్ అంటూ..

హిట్ ప్లాప్ అంటూ తేడా లేకుండా వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు చిరింజీవి. ఆయన నటించిన తాజా చిత్రం గాడ్ ఫాదర్. మలయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ కు రీమేక్ వచ్చిన ఈ చిత్రం అక్టోబర్ 5న విడుదల కానుంది. ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహించగా.. బుధవారం ప్రీ రిలీజ్ వేడుకను కూడా చాలా గ్రాండ్ గా నిర్వహించారు. ఇదే కాకుండా పలు చిత్రాల్లో నటిస్తున్నారు చిరంజీవి.

 భోళా శంకర్ చిత్రంలో..

భోళా శంకర్ చిత్రంలో..

అందులో మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం స్టార్ హీరో అజిత్ నటించిన వేదాళం మూవీకి రీమేక్ గా రానుంది. ఇక ఇదే కాకుండా చిరంజీవి నటిస్తున్న మరో చిత్రం వాల్తేరు వీరయ్య. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, యలమంచలి రవి శంకర్ నిర్మించగా.. టాలెంటెడ్ డైరెక్టర్‌ కేఎస్ రవీంద్ర అలియాస్ బాబీ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.

 మల్టీస్టారర్ మూవీగా..

మల్టీస్టారర్ మూవీగా..

క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న 'వాల్తేరు వీరయ్య' మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కబోతున్నట్లు దర్శకుడు బాబీ ఎప్పుడో తెలిపాడు. అందుకు అనుగుణంగానే ఈ సినిమాలోని కీలకమైన పాత్రలో మాస్ మహారాజా రవితేజ నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే అతడు షూటింగ్‌లో కూడా పాల్గొన్నాడు. ఈ విషయాన్ని ఇటీవల ఓ వీడియో ద్వారా వెల్లడించారు. ఈ వీడియోలో క్యారవ్యాన్ లో కి రవితేజను చేయిపట్టుకుని చిరంజీవి ఆహ్వానించడం చూడొచ్చు.

చిరంజీవిని అరెస్ట్ చేసి..

చిరంజీవిని అరెస్ట్ చేసి..

ఇప్పుడు ఈ సినిమా చిత్రీకరణకు సంబంధించిన ఓ వీడియో లీక్ అయింది. ఈ వీడియోలో చిరంజీవిని అరెస్ట్ చేసి రవితేజ తీసుకెళ్తున్నట్లుగా రాసుకొచ్చాడు ఓ నెటిజన్. అంతేకాకుండా ఈ చిత్రీకరణ వైజాగ్ లోని జెట్టిలో జరిగిందని తెలిపాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. అంటే ఈ చిత్రంలో రవితేజ పోలీస్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఆలస్యంగా వచ్చిన చిరంజీవి విశాఖపట్నంలో షూటింగ్ కారణంగా లేట్ అయిందని చెప్పిన విషయం తెలిసిందే.

ఒక్కొక్కరు ఒక్కో సీన్‌లో..

ఇదిలా ఉంటే ఈ సినిమాలో చాలా మంది టాలీవుడ్ స్టార్ యాక్టర్స్ నటిస్తున్నారనే వార్తలు తెగ హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రంలో రవితేజ నటిస్తుండగా.. స్టార్ హీరోలు వెంకటేష్, నాగార్జున కూడా యాక్ట్ చేయనున్నారనే వార్తలు హాట్ టాపిక్ అవుతున్నాయి. అయితే, ఇంత మంది హీరోలు ఉన్నా.. వీళ్లందరూ సింగిల్ ఫ్రేమ్‌లో మాత్రం కనిపించరట. ఒక్కొక్కరు ఒక్కో సీన్‌లో మాత్రమే వచ్చి వెళ్తారని విశ్వసనీయంగా తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X