రాఘవేంద్రరావు, దిల్ రాజు, సురేందర్ రెడ్డి అందరూ.. క్రాక్ అప్‌డేట్
మాస్ మాహారాజా రవితేజ హీరోగా కమర్షియల్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో హ్యాట్రిక్ మూవీగా కొత్త సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. రవితేజ కెరీర్‌లో ఇది 66వ సినిమాగా రూపుదిద్దుకోనుంది. ఈ రోజు (నవంబర్ 14) ఉదయం ఈ సినిమా టైటిల్ పోస్టర్ విడుదల చేసిన చిత్రయూనిట్.. ఆ తర్వాత కొద్ది సేపటికే సినిమా పూజా కార్యక్రమాలు నిర్వహించింది.
ఈ కార్యక్రమానికి అల్లు అరవింద్, రాఘవేంద్రరావు, దిల్ రాజు, సురేందర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. పూజ అనంతరం తొలి షాట్‌కి అల్లు అరవింద్ క్లాప్ కొట్టారు. రవితేజ, హీరోయిన్ శృతి హాసన్‌పై తొలి సీన్ చిత్రీకరించారు. ఎంతో ఘనంగా ఈ కార్యక్రమం జరిగింది.

చాలా రోజులుగా సినిమాలకు దూరమైన హీరోయిన్ శృతీహాసన్ ఈ చిత్రంతో రీ-ఎంట్రీ ఇవ్వబోతోంది. వరలక్ష్మీ శరత్ కుమార్ కూడా కీలక పాత్రలో నటించనుంది. సరస్వతి ఫిలిం డివిజన్ బ్యానర్‌లో బీ మధు నిర్మిస్తున్న ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిస్తున్నారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా రానున్న ఈ సినిమాని 2020 సమ్మర్‌లో విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.
వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్న మాస్ మహారాజ్ రవితేజ.. ఇటీవలే డైరెక్టర్ ఆనంద్ దర్శకత్వంలో డిస్కోరాజా సినిమాను పూర్తి చేశాడు. ఈ సినిమా డిసెంబర్ నెలలో విడుదల కానుంది. ఈ రెండు సినిమాలు రవితేజ కెరీర్‌ని తిరిగి ట్రక్ లోకి తీసుకొస్తాయని బలంగా నమ్ముతున్నారు ఆయన ఫ్యాన్స్.


Click it and Unblock the Notifications











