యూరఫ్‌లో 25 రోజుల పాటు రామ్ చరణ్-బోయపాటి మూవీ షూట్
రామ్ చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న నేటి నుండి యూరఫ్‌లో షూటింగ్ జరుపుకోబోతోంది. యూరఫ్‌లోని అజర్బైజాన్ అనే ప్రాంతంలో చిత్రీకరణ మొదలైంది. ఇక్కడ షూటింగు జరుపుకుంటోన్న తొలి తెలుగు సినిమా ఇదే అని అంటున్నారు.
గ్యాప్ లేకుండా 25 రోజుల పాటు ఇక్కడ షూటింగ్ జరుతుందని చిత్ర బృందం తెలిపింది. రామ్ చరణ్, వివేక్ ఒబెరాయ్, ప్రశాంత్ ఇతర ముఖ్య తారాగణంపై యాక్షన్ సీన్లు చిత్రీకరిస్తున్నారు. ఇక్కడ చిత్రీకరించే సన్నివేశాలు సినిమాలో హైలెట్ అవుతాయని టాక్.

మాస్ ఇమేజ్ ఉన్న హీరో రామ్‌చరణ్, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో సినిమా అంటే సినిమాపై ఎన్ని అంచనాలుంటాయో అందరికీ తెలిసిందే. ఈ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా సినిమాను రూపొందిస్తున్నారు. ముఖ్యంగా యాక్షన్ సీన్ల విషయంలో బోయపాటి ఏమాత్రం కాంప్రమైజ్ కావడం లేదు.
సినిమాలోని ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ కోసం రూ. 5 కోట్ల వరకు ఖర్చు చేశారు. ఈ సీన్లో ఏకంగా 500 మంది బాడీ బిల్డర్లు పాల్గొంటున్నారని, వీరితో పాటు 60 మంది నటులు ఈ యాక్షన్ సీక్వెన్స్‌లో కనిపిస్తారని సమాచారం.
బోయపాటి ఇప్పటి వరకు తీసిన సినిమాలన్నింటిలోనూ భారీ యాక్షన్ సీన్లు ఉన్నాయి. ఒక్కో సినిమాకు డోసు పెంచుతూ వచ్చాడు. తన గత చిత్రాలను మించి పోయేలా రామ్ చరణ్ మూవీ రూపొందిస్తున్నారట బోయపాటి.
ఈ సినిమాని సంక్రాంతికి విడుదల చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే రంగస్థలం సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన రామ్ చరణ్.... వచ్చే సంక్రాంతికి మరో భారీ మూవీతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రంగం సిద్ధమైంది.
ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ త్వరలో ఖరారు చేయనున్నారు. భరత్ అనే నేను మూవీ ఫేం కియారా అద్వానీ ఈ చిత్రంలో రామ్ చరణ్‌తో రొమాన్స్ చేస్తోంది. ప్రశాంత్, వివేక్ ఒబెరాయ్, స్నేహ, హిమజ, ప్రవీణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. డివివి దానయ్య నిర్మాత.


Click it and Unblock the Notifications











