3 కోట్లతో ప్రత్యేక సెట్.. ఎన్టీఆర్, రామ్‌చరణ్ ఓపెనింగ్ సాంగ్ షూట్
బాహుబలి లాంటి భారీ సిరీస్ తర్వాత జక్కన చేస్తున్న సినిమా RRR. డి.వి.వి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డి.వి.వి దానయ్య నిర్మాణంలో భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. చిత్రంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్నారు. చెర్రీ సరసన ఆలియా భట్ హీరోయిన్ గా ఎంపిక కాగా.. ఎన్టీఆర్ హీరోయిన్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
ఇటీవలే 50 కోట్ల బడ్జెట్ కేటాయించి చెర్రీ- ఎన్టీఆర్ ల మధ్య ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించారు రాజమౌళి. షెడ్యూల్ ప్రకారం దీని తరువాత ప్రస్తుతం రామ్ చరణ్, ఆలియా భట్ మధ్య తెరకెక్కాల్సిన కొన్ని సన్నివేశాల చిత్రీకరణ జరగాల్సి ఉంది. కానీ ఆరోగ్యం బాగా లేక ఆలియా విదేశాలకు వెళ్లడం కారణంగా ఈ సమయాన్ని ఎన్టీఆర్- చెర్రీ లతో కవర్ చేస్తున్నారట జక్కన్న. ఈ నేపథ్యంలో తాజాగా వీరిద్దరి పాత్రల పరిచయ గీతాన్ని 3 కోట్ల బడ్జెట్‌తో వేసిన ప్రత్యేక సెట్ లో షూట్ చేయాలని నిర్ణయించారట రాజమౌళి. ఈ ప్రత్యేకమైన సెట్ హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో వేయనుకున్నాడు జక్కన్న.

చారిత్రక నేపథ్యంలో ఎన్నో హంగులు జోడించి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని RRR సినిమా షూట్ చేస్తున్నారు రాజమౌళి. చిత్రంలో కొమురం భీం పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామ రాజు పాత్రలో రామ్ చరణ్ నటిస్తున్నారు. ఇంకా బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్, కోలీవుడ్ క్యారెక్టర్ యాక్టర్ సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు. భారీ అంచనాల నడుమ వచ్చే ఏడాది జులై 30 వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











