సాహో ఇంటర్వెల్ కోసం కోట్లు కుమ్మరించారు... డబ్బు నీళ్లలా.. ఎంత ఖర్చు చేశారో తెలిస్తే షాకే!

Recommended Video

Saaho Producers Spend Rs 30 Crore For Interval Sequence | Filmibeat Telugu

సాహో చిత్రాన్ని అంతర్జాతీయ సినిమా ప్రమాణాలకు ధీటుగా దర్శకుడు సుజిత్ రెడ్డి తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రాన్ని హాలీవుడ్ సినిమా ప్రమాణాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా తెరకెక్కించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ టెక్నిషియన్స్‌ను ఎంపిక చేసుకోవడం తెలిసిందే. అనుకొన్న ప్లాన్ ప్రకారం అంతా సవ్యంగా జరిగితే సాహో చిత్రం భారతీయ యాక్షన్ సినిమాలకు ఐకాన్‌గా మారే అవకాశం లేకపోలేదు. తాజాగా సాహో యాక్షన్ సీన్లకు సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం వెలుగు చూసింది. అదేమిటంటే..

అంతర్జాతీయ ప్రమాణాలతో యాక్షన్ పార్ట్

అంతర్జాతీయ ప్రమాణాలతో యాక్షన్ పార్ట్

సాహో సినిమాకు సంబంధించిన యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారుతున్నాయి. ఈ చిత్రంలోని యాక్షన్ పార్ట్‌ను రూ.90 కోట్లతో అబుదాబీలో చిత్రీకరించిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ స్థాయికి తగినట్టుగా అంత భారీ ఎత్తున్న స్టంట్స్‌ను చిత్రీకరించడం సినీవర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.

రూ.30 కోట్లతో ఇంటర్వెల్

రూ.30 కోట్లతో ఇంటర్వెల్

తాజాగా సాహో ఇంటర్వెట్ సీన్‌ను అత్యంత భారీగా చిత్రీకరించడం మరోసారి చర్చకు దారి తీసింది. ప్రస్తుతం సాహో చిత్ర పోరాట సన్నివేశాలను హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో చిత్రీకరిస్తున్నారు. ఇంటర్వెల్ బ్యాంగ్ కోసం చిత్రీకరించే సనివేశాల కోసం రూ.30 కోట్లు ఖర్చు చేసినట్టు తెలిసింది.

కెన్నీ బేట్స్ పర్యవేక్షణలో ఫైట్స్

కెన్నీ బేట్స్ పర్యవేక్షణలో ఫైట్స్

రామోజీ ఫిలింసిటీలో జరుగుతున్న పోరాట సన్నివేశాల చిత్రీకరణ హాలీవుడ్ స్టంట్ కోరియోగ్రాఫర్ కెన్నీ బేట్స్ పర్యవేక్షణలో జరిగింది. ఇంటర్వెల్‌కు ముందు వచ్చే ఈ సీన్లు ప్రేక్షకులను థ్రిల్లింగ్ గురిచేస్తాయి. హాలీవుడ్ ప్రమాణాలకు ఏ మాత్రం తీసిపోనట్టుగా ఉంటాయి అని చిత్ర యూనిట్ పేర్కొన్నది.

రికార్డుస్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్

ఇదిలా ఉండగా, సాహో చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ హక్కులు టాక్ ఆఫ్ ఇండస్ట్రీగా మారింది. ఈ చిత్ర హక్కులను భారీ రేటు చెల్లించి ఫార్స్ ఫిల్మ్స్ అనే సంస్థ దక్కించుకొన్నది. ఎంత మేరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందనే వివరాలు అధికారికంగా వెల్లడికాలేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X