Bro మూవీ షూటింగ్ ఫొటో లీక్: హీరోయిన్‌ను టీజ్ చేస్తున్న మెగా హీరో
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు ఎన్నో రకాల సినిమాలు రూపొందుతున్నాయి. అందులో స్టార్లు చేసే చిత్రాలతో పాటు చిన్న చిన్న హీరోలు చేస్తున్న మూవీలు కూడా ఉన్నాయి. వీటన్నింటిలో కొన్ని మాత్రమే ఆరంభంలోనే అదరి దృష్టిని ఆకర్షించి అంచనాలను ఏర్పరచుకుంటున్నాయి.
అలాంటి వాటిలో మెగా హీరోలు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ - సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న 'బ్రో (BRO)' మూవీ ఒకటి. అదిరిపోయే కలయికలో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రంపై హైప్ క్రమంగా పెరుగుతోంది. అందుకు తగ్గట్లే దీన్ని తీస్తున్నారు.

పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న 'బ్రో (BRO)' మూవీని ప్రముఖ నటుడు, దర్శకుడు సముద్రఖని రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ గత ఫిబ్రవరిలోనే ప్రారంభం అయింది. ఆ వెంటనే వరుసగా షెడ్యూళ్లను పూర్తి చేసుకుని.. టాకీ పార్టును ఎవరు ఊరించనంత వేగంగా కంప్లీట్ చేసుకున్నారు.
అయితే, సాయి ధరమ్ తేజ్‌పై పాటను మాత్రం షూట్ చేయాల్సి ఉందని ఆ మధ్య టాక్ నడిచింది. ఈ నేపథ్యంలో తాజాగా దీని నుంచి ఓ క్రేజీ ఫొటో లీకైంది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'బ్రో (BRO)' మూవీకి సంబంధించిన సాంగ్ షూటింగ్ ఇప్పుడు ఫారెన్‌లో జరుగుతున్నట్లు తాజాగా ఓ న్యూస్ లీకైంది. దీనికి కారణం సాయి ధరమ్ తేజ్, హీరోయిన్ కేతిక శర్మ ఉన్న షూటింగ్ లొకేషన్ ఫొటో ఒకటి బయటకు రావడమే.
ఇందులో సుప్రీమ్ హీరో స్టైల్‌గా కూర్చుని ఉండగా.. హీరోయిన్ మాత్రం తిట్టుకుంటున్నట్లుగా నడుచుకుంటూ వెళ్తోంది. ఇక, ఈ స్టిల్ చూస్తుంటే ఇదో టీజింగ్ సాంగ్ అన్నట్లుగా అర్థం అవుతుంది. ఈ ఫొటో చూసిన తర్వాత షూటింగ్ ఇంకెంత కాలం చేస్తారు అంటూ కొందరు కోప్పడుతున్నారు.
'బ్రో (BRO)' చిత్రంలో కేతిక శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్లుగా నటిస్తోన్నారు. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈ చిత్రానికి త్రివిక్రమ్ డైలాగ్స్, స్క్రీన్‌ప్లేకు వర్క్ చేస్తున్నారు. థమన్ సంగీతం ఇస్తున్నాడు. దీన్ని జూలై 28న విడుదల చేస్తున్నారు. ఈ మూవీ 'వినోదయ సీతమ్'కు రీమేక్‌గా తెరకెక్కుతోంది.


Click it and Unblock the Notifications











