»   » చిత్ర‌ల‌హ‌రి షూటింగ్ ప్రారంభం.. సాయిధరమ్ తేజ్ రిలీజ్ డేట్ ఎప్పుడంటే..

చిత్ర‌ల‌హ‌రి షూటింగ్ ప్రారంభం.. సాయిధరమ్ తేజ్ రిలీజ్ డేట్ ఎప్పుడంటే..

Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    సుప్రీమ్ హీరో సాయిధ‌రమ్ తేజ్ హీరోగా నేను శైల‌జ ఫేమ్ కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో శ్రీమంతుడు, జ‌న‌తాగ్యారేజ్‌, రంగ‌స్థ‌లం వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌ను నిర్మించిన ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీమేక‌ర్స్ బ్యాన‌ర్‌పై న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, చెరుకూరి మోహ‌న్ నిర్మిస్తోన్న చిత్రం చిత్ర‌ల‌హ‌రి. ఇటీవ‌ల లాంఛ‌నంగా ప్రారంభ‌మైన ఈ చిత్రం .. రెగ్యుల‌ర్ షూటింగ్ సోమ‌వారం హైద‌రాబాద్‌లో ప్రారంభమైంది.

    సాయిధ‌ర‌మ్ తేజ్ స‌ర‌స‌న క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్‌, నివేదా పేతురాజ్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను 2019 ఏప్రిల్‌లో విడుద‌ల చేయడానికి నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు.

    ఈ సంద‌ర్భంగా నిర్మాత‌లు మాట్లాడుతూ.. కిషోర్ తిరుమల సినిమా అంటే కూట్ ఎంట‌ర్‌టైనింగ్‌గా ఉంటూనే ఎమోష‌న్స్ క్యారీ అవుతుంటాయి. అలాంటి మ‌రో ఫ్యామిలీ ఎంట‌ర్‌టైనింగ్ స‌బ్జెక్ట్‌తో చిత్ర‌ల‌హ‌రి తెర‌కెక్కుతోంది. రెగ్యుల‌ర్ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. మా బ్యాన‌ర్‌లో శ్రీమంతుడు, జ‌న‌తాగ్యారేజ్‌, రంగ‌స్థ‌లం చిత్రాల‌కు బ్లాక్ బ‌స్ట‌ర్ సంగీతాన్ని అందించిన రాక్‌స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు.

     Sai Dharam Tejs Chitralahari movie Shoot started
    d

    ఆయ‌న సంగీతం సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంద‌న‌డంలో సందేహం లేదు. సాయిధ‌ర‌మ్ తేజ్‌ను స‌రికొత్త యాంగిల్‌లో కిషోర్ తిరుమ‌ల‌ ప్రెజంట్ చేస్తున్నారు. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసి సినిమాను వ‌చ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుద‌ల చేయాల‌నుకుంటున్నాం అన్నారు.

    సాయిధ‌ర‌మ్‌తేజ్‌, క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్, నివేదా పేతురాజ్‌ హీరో హీరోయిన్స్‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్ర‌సాద్‌, సినిమాటోగ్ర‌ఫీ: కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని, ఆర్ట్‌: ఎ.ఎస్‌.ప్ర‌కాశ్‌, సి.ఇ.వో/ సి.ఒ.ఐ: పి.చిరంజీవి, ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్, లైన్ ప్రొడ్యూస‌ర్‌: కె.వి.వి.బాల సుబ్ర‌మ‌ణ్యం, కో-ప్రొడ్యూసర్: ఎం.ప్రవీణ్, నిర్మాత‌లు: నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్ చెరుకూరి (సి.వి.ఎం), ద‌ర్శక‌త్వం: కిషోర్ తిరుమల.

    English summary
    Sai Dharam Tej's Chitralahari movie Shooting started on November 19th. Kalyani Priyadarshini, Niveda Peturaj are the lead heroines. Kishore Tirumala is the director. This movie is produced by Mythri Movie makers.
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more