అభిమానుల మనసు దోచుకున్న మెగా హీరో!
మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం చిత్రలహరి చిత్రంలో నటిస్తున్నాడు. కిషోర్ తిరుమల దర్శత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. చిత్రలహరి షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో నిర్మించిన భారీ సెట్ లో జరుగుతోంది. తనని చూసేందుకు వచ్చిన అభిమానుల విషయంలో తేజు మనసు దోచుకునే పని చేశాడు. అక్కడ వచ్చిన అభిమానులందరితో సెల్ఫీలు దిగిన తేజు వారందరికీ భోజనం ఏర్పాట్లు చేశాడు.

ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆరంభం నుంచి తేజు అభిమానులతో చేరువగా ఉండేందుకే ప్రయత్నిస్తున్నాడు. కెరీర్ ఆరంభంలో వరుస విజయాలు అందుకున్న తేజు ఇటీవల వరుస పరాజాయాలతో డీలా పడ్డాడు. తేజు కెరీర్ మళ్ళీ పుంజుకోవాలనుంటే చిత్రలహరి చిత్రం తప్పనిసరిగా విజయం సాధించాలి. ఈ చిత్రం కోసం సాయిధరమ్ తేజ్ గడ్డం లుక్ లో కనిపించబోతున్నాడు.

ఈ చిత్రంలో హీరోయిన్లుగా కళ్యాణి ప్రియదర్శన్, నివేత పెతురాజ్ నటిస్తున్నారు. దర్శకుడు కిషోర్ తిరుమల ఈ చిత్రాన్ని ట్రైయాంగిల్ ప్రేమ కథగా రూపొందించనున్నట్లు తెలుస్తోంది. మైత్రి మూవీస్ నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఏప్రిల్ లో ఈ చిత్ర విడుదలకు సన్నాహకాలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











