twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అక్కడే అనుకున్నారు.. కానీ కష్టమని తెలిసి ఇలా డిసైడ్ అయ్యారట.. మహేష్ అప్‌డేట్

    |

    సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‌లో 26వ సినిమాగా రానున్న సరిలేరు నీకెవ్వరు అప్‌డేట్స్ ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఎక్కడా తగ్గేదే లేదన్నట్లుగా దర్శకనిర్మాతలు ముందుకు వెళ్తున్నారు. మహేష్ 25వ సినిమా మహర్షిని బీట్ చేసేలా సినిమా రూపొందించాలని సర్వాంగ సుందరమైన రియాలిటిక్ లొకేషన్స్ చూస్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కర్నూల్ లోని కొండారెడ్డి బురుజులో చేయాల్సిన కొన్ని సన్నివేశాల కోసం ఏకంగా 4 కోట్ల రూపాయలు వెచ్చించి ప్రత్యకంగా సెట్ వేశారట. రామోజీ ఫిలిం సిటీలో రెడీ అవుతున్న ఈ సెట్స్ పై మహేష్ బాబుతో కొన్ని సన్నివేశాల చిత్రీకరణ త్వరలోనే జరగనుందని తెలుస్తోంది.

    నిజానికి కర్నూల్ లోని కొండారెడ్డి బురుజుకే వెళ్లి షూటింగ్ చేయాలని భావించిందట చిత్రయూనిట్. కానీ కొన్ని పరిస్థితుల కారణంగా అక్కడ షూటింగ్ చేయడం కష్టమని తెలిసి, ప్రత్యేకంగా కొండారెడ్డి బురుజు, ఆ పరిసర వీధులకు సంబంధించిన సెట్ ను వేసే పని పెట్టుకున్నారట నిర్మాతలు. ఇదొక్కటే గాక అన్నపూర్ణ స్టూడియోలో ట్రైన్ సెట్, విజయశాంతి ఇంటి కోసం ఒక భారీ సెట్‌ను వేస్తున్నారని సమాచారం. మొత్తానికి బడ్జెట్ విషయంలో వెనకడుగేయకుండా రియాలిటిక్ లొకేషన్స్ ఫీలింగ్ తెచ్చేలా ఈ సెట్స్ రూపొందిస్తున్నారట.

     SariLeru Neekevvaru intresting update

    అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న'సరిలేరు నీకెవ్వరు' చిత్రంలో మహేష్ బాబు సరసన క్రేజీ హీరోయిన్ రష్మిక మందన్న నటిస్తుండగా.. సీనియర్ హీరోయిన్ విజయశాంతి కీలక పాత్ర పోషిస్తోంది. దాదాపు 15 ఏళ్ల తర్వాత విజయశాంతి రీ ఎంట్రీ ఇస్తుండటం ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని నింపుతోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని భావిస్తున్నారు దర్శకనిర్మాతలు.

    English summary
    Mahesh Babu's 26th movie SariLeru Neekevvaru which is directed by Anil Ravipudi. In this movie the train Commedy track will be hilight as per latest talk in filmnagar. In this movie Vijayashanti playing lead role after 15 years. As per latest talk making a huze set on ramoji film city.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X