సరిలేరు నీకెవ్వరు ఇంట్రెస్టింగ్ అప్‌డేట్.. ఇక మిగిలింది ఆ రెండు మాత్రమే
ఇటీవలే 'మహర్షి' సినిమాతో తన సినీ జర్నీలో సిల్వర్ జూబ్లీ కంప్లీట్ చేసుకున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఈ విజయంతో సూపర్ జోష్ లోకి వచ్చిన ఆయన ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో నటిస్తున్నాడు. మహేష్ కెరీర్‌లో 26వ సినిమాగా రాబోతున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా లేటెస్ట్ అప్‌డేట్ తెలిసింది.
తాజాగా అందిన సమాచారం మేరకు 'సరిలేరు నీకెవ్వరు' చిత్రానికి సంబంధించి కేవలం రెండు పాటలు మాత్రమే మిగిలి ఉన్నాయట. అందులో ఒకటి హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో, మరొకటి అన్నపూర్ణ స్టూడియోస్‌లో చిత్రీకరించనున్నారని తెలిసింది. సంక్రాంతి రేస్‌లో ప్రక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్న కారణంగా వారి అంచనాలను మించి సినిమా అవుట్‌పుట్ వచ్చేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారట డైరెక్టర్ అనిల్ రావిపూడి.

ఈ సినిమాలో మహేష్ బాబు సరసన క్రేజీ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. డిసెంబర్ నుండి ప్రమోషన్స్ వేగవంతం చేసే దిశగా నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారట. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాలో ఇప్పటి వరకు టైటిల్ ట్రాక్ మాత్రమే విడుదలైంది. మిగతా లిరికల్ సాంగ్స్ త్వరలోనే విడుదల కాబోతున్నాయట. చిత్రంలో విజయశాంతి కీలక పాత్ర పోషిస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 11వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











