రీతూవ‌ర్మ జంట‌గా శ‌ర్వానంద్‌ కొత్త సినిమా షురూ.. వివరాలివే

జయాపజయాలతోనే కెరీర్ ముందుగు సాగుతుంది అని నమ్ముతూ వరుస సినిమాలతో ముందుకు సాగుతున్నాడు యంగ్ హీరో శర్వానంద్. ఇటీవలే రణరంగం సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఆయన తాజాగా మరో సినిమా మొదలుపెట్టేశాడు. ఈ రోజే శర్వానంద్ కొత్త సినిమా షూటింగ్ ముహూర్తపు కార్యక్రమాలు జరిగాయి.

ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ఈ సినిమా రూపొందనుంది. ఎస్‌.ఆర్‌.ప్ర‌కాశ్ బాబు, ఎస్‌.ఆర్‌.ప్ర‌భు నిర్మాత‌లుగా వ్యవహరించనుండగా, శ్రీ కార్తీక్ ద‌ర్శ‌క‌త్వం వహించనున్నారు. ఈ రోజే సినిమా షూటింగ్ పూజా కార్యక్రమాలు నిర్వహించి లాంఛనంగా ప్రారంభించారు. చెన్నై నగరంలో ఈ కార్యక్రమం జరిగింది. చిత్రానికి సంబందించిన రెగ్యులర్ షూటింగ్ కూడా ఈ రోజు నుండే జరగనుందని పేర్కొంది చిత్రయూనిట్.

 Sharwanands New Movie Started with Ritu Varma

ఇక ఈ చిత్రంలో శర్వానంద్ సరసన 'పెళ్ళిచూపులు' ఫేమ్ రీతూవ‌ర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. నాజ‌ర్‌, వెన్నెల‌కిషోర్‌, ప్రియ‌ద‌ర్శి కీల‌క పాత్రలు పోషించనున్నారు. స్నేహం, ప్రేమ అనే రెండు అంశాలను కలగలుపుతూ అద్భుతమైన స్క్రిప్ట్ రెడీ చేశాడు డైరెక్టర్ శ్రీ కార్తీక్. చిత్రానికి ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు త‌రుణ్ భాస్క‌ర్ డైలాగ్స్ రాయడం విశేషం. జాక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సుజిత్ సారంత్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. త్వర త్వరగా షూటింగ్ ఫినిష్ చేసి 2020 సమ్మర్‌లో కల్లా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుంచాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X