Vijay Deverakonda సమంతపై రూమర్లు.. ఖండించిన దర్శకుడు అసలు జరిగిందేమిటంటే?

లైగర్ మూవీ తర్వాత విజయ్ దేవరకొండ నటిస్తున్న చిత్రం ఖుషి. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో సమంత హీరోయిన్‌గా నటిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్‌ ఇటీవల జమ్ము, కాశ్మీర్‌లో జరిగింది. ఈ షూటింగ్ సందర్భంగా విజయ్ దేవరకొండ పుట్టిన రోజు వేడుకలు కూడా ఘనంగా జరిగాయి. సమంత, శివ నిర్వాణ, యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. అయితే ఇటీవల షూటింగ్ ముగించుకొని ఖుషీ టీమ్ హైదరాబాద్‌కు చేరుకొన్నది. అయితే ఖుషి సినిమా షూట్‌లో విజయ్ దేవరకొండ, సమంతకు గాయాలు అయ్యాయనే వార్త జాతీయ మీడియాలో వైరల్ అయింది. అయితే ఈ వార్తను ఖుషీ పీఆర్ టీమ్ ఖండించింది.

Recommended Video

సమంత తో రొమాన్స్ చేస్తున్న విజయ్ దేవరకొండ - VD11 ప్రారంభం | Oneindia Telugu

జాతీయ దినపత్రికల్లో కథనం ప్రకారం.. కశ్మీర్‌లోని పహల్గామ్‌లో సమంత, విజయ్ దేవరకొండ ఓ స్టంట్ సీన్‌లో పాల్గొన్నారు. వాహనంలో వెళ్లే సీన్లను చిత్రీకరించారు. చాలా కష్టమైనవి కావడంతో రోప్స్ కూడా కట్టారు. కానీ ఆ కారు లిడ్డర్ రివర్‌లోకి దూసుకెళ్లింది. లోతైన ప్రాంతంలో వారు పడ్డారు. వెన్నుముక ప్రాంతంలో సమంత, విజయ్ దేవరకొండకు గాయలు అయ్యాయి అని పేర్కొన్నారు. ఈ ఘటన శనివారం శ్రీనగర్‌లోని దాల్ లేక్ సమీపంలో జరిగింది. ఆ తర్వాత ఇద్దరిని హోటల్‌కు తరలించారు. అనంతరం వారికి ఫిజియోథెరపీ చేయించారు అని కథనంలో పేర్కొన్నారు. అయితే ఈ వార్తల్లో వాస్తవం లేదని ఖుషీ పీఆర్ వర్గాలు ఖండించారు. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేశారు.

Shiva Nirvana condemns accident to Vijay Deverakonda, Samantha in Kushi movie shooting

ఖుషి సినిమా షూటింగ్ లో విజయ్ దేవరకొండ, సమంతకు గాయాలు అయినట్టు కొన్ని వెబ్ సైట్ లల్లో వార్తలు వస్తున్నాయి. అందులో ఎలాంటి వాస్తవం లేదు. టీం అంతా సక్సెస్‌ఫుల్‌గా కాశ్మీర్‌లో 30 రోజుల షూటింగ్ కంప్లీట్ చేసుకొని నిన్న‌నే హైదరాబాద్ తిరిగి వచ్చారు. రెండో షెడ్యూల్ అతి త్వరలోనే మొదలు కానుంది. దయచేసి ఎలాంటి పుకార్లు నమ్మొద్దు అని ఖుషీ పీఆర్ వర్గాలు వెల్లడించాయి

దర్శకుడు శివ నిర్వాణ కూడా ప్రమాదం జరిగిందనే వార్తలో నిజం లేదు. ఫేక్ వార్త అంటూ ట్వీట్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X