మిస్టరీ థ్రిల్లర్‌గా సుబ్రహ్మణ్యపురం.. విభిన్న కథతో సుమంత్, లేటెస్ట్ అప్డేట్!

By Bojja Kumar

హీరో సుమంత్, ఈషా రెబ్బ హీరో హీరోయిన్లుగా ప్రస్తుతం 'సుబ్రహ్మణ్యపురం' అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సుధాకర్ ఇంపెక్స్ ఇండియా ప్రవైట్ లిమిటెడ్ పతాకంపై బీరం సుధాకర్‌రెడ్డి నిర్మిస్తున్నారు. సంతోష్ జాగర్లపూడి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సుమంత్ కెరీర్‌లో 25వ చిత్రం ఇది.

ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఆగస్టు 8 నుండి హైదరాబాద్‌లో హీరో, హీరోయిన్ ఇతర తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇప్పటికే సగం షూటింగ్ పూర్తయింది.

సూపర్ నాచురల్ అంశాల మేళవింపుతో సాగే మిస్టరీ థ్రిల్లర్ కాన్సెప్టుతో ప్రేక్షకుల్లో ఉత్కంఠ కలిగించే కథతో సిమా తెరకెక్కిస్తున్నట్లు నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రంలో సుబ్రహ్మాణ్యం స్వామిపై వున్న ఓ అద్భుతమైన పాటకు ప్రముఖ పాటల రచయిత జోన్నవిత్తుల రామలింగేశ్వరరావు సాహిత్యాన్ని అందించగా, ఎస్‌పీ బాలసుబ్రమణ్యం ఆ పాటను పాడారని నిర్మాత బీరం సుధాకర్ రెడ్డి తెలిపారు.

Subrahmanyampuram shooting in Hyderabad

దర్శకుడు మాట్లాడుతూ అనుగ్రహించే దేవుడే ఆగ్రహిస్తే ఆ భక్తుల పరిస్థితి ఏమిటి అనే నేపథ్యంలో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రంలో సుమంత్ నాస్తికుడిగా, దేవుడంటే నమ్మకం లేని వ్యక్తిగా కనిపిస్తారని తెలిపారు.

సుమంత్, ఇషారెబ్బ,తనికెళ్ల భరణి, సాయికుమార్, అలీ, సురేష్, జోష్ రవి, భద్రమ్ గిరి, మాధవి, హర్షిణి, టీఎన్‌ఆర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఆర్.కె. ప్రతాప్, సంగీతం: శేఖర్‌చంద్ర, ఎడిటర్: కార్తీక శ్రీనివాస్, కళా దర్శకత్వం: లక్ష్మీసింధూజ గ్రంధి, ప్రాజెక్ట్ డిజైనర్: కృష్ణ చిత్తనూర్, ైస్టెలింగ్: సుష్మ త్రిపురాన, ప్రొడక్షన్ కంట్రోలర్:సలాన బాలగోపాలరావు, మూలకథ: వెంకట శ్రీనివాస్ బొగ్గరం, రచనా సహకారం: నాగమురళీధర్ నామాల, నిర్మాత: బీరం సుధాకర్‌రెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సంతోష్ జాగర్లపూడి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X