కెవి ఆనంద్ డైరెక్షన్‌లో సూర్య.. కొత్త లుక్ అదిరిందిగా!
కెవి ఆనంద్ దర్శకత్వంలో సూర్య కొత్త చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన వీడోక్కడే, బ్రదర్స్ వంటి చిత్రాలు మంచి విజయం సాధించాయి. వీరి కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.
తాజగా షూటింగ్ స్పాట్ నుంచి లీకైన సూర్య స్టిల్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. సూర్య కొత్త లుక్ అదుర్స్ అనిపించే విధంగా ఉంది. టిప్ టాప్ గా టక్ చేసి, షూ ధరించి, గాగుల్స్ పెట్టుకుని స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. చూస్తుంటే ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడని అనిపిస్తోంది.

ఇదిలా ఉండగా ఈ చిత్రంలో మలయాళీ స్టార్ హీరో మోహన్ లాల్ కీలక పాత్రలో నటిస్తుండడం విశేషం. హీరో ఆర్య కూడా ఈ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని చెన్నై, హైదరాబాద్ సహా దేశ విదేశాల్లోని పలు షూటింగ్ లొకేషన్ లలో చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











