బిగ్‌బీతో పవన్ కల్యాణ్.. సైరా షూటింగ్ ఫోటో లీక్..
Recommended Video

టాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రం సైరా నర్సింహారెడ్డి. ఈ చిత్రం యుద్ధ సన్నివేశాలను హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా చిత్రీకరిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి జన్మదినోత్సం సందర్బంగా ఈ నెల 21న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను విడుదల చేయగా రికార్డు వ్యూస్ సాధించింది. అయితే ఈ చిత్ర షూటింగ్ జరుగుతుండగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సెట్‌ను సందర్శించిన ఫొటో బయటకు లీకై సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే..

అమితాబ్‌తో పవన్ కల్యాణ్
సైరా నర్సింహారెడ్డి చిత్రంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ ఈ కీలక పాత్రలో నటిస్తున్నారు. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డికి గురువుగా కనిపించబోతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ జరుగుతుండగా పవన్ కల్యాణ్ వెళ్లి బిగ్‌బీ అమితాబ్‌ను కలుసుకొన్నారు.
బిగ్‌బీతో ఫోటో వైరల్
బిగ్‌బీని కలుసుకొన్న సమయంలో పవన్ కల్యాణ్‌తోపాటు రాంచరణ్, చిరంజీవి కూడా ఉన్నారు. నలుగురు సూపర్ హీరోలు కలిసి ఉన్న ఈ ఫోటో మీడియాలో వైరల్ అయింది. ప్రస్తుతం ఈ ఫోటోను నెటిజన్లు రీట్వీట్ చేయడంతో విస్తృతంగా ప్రచారమవుతున్నది.

రికార్డు స్థాయి వ్యూస్
ఇటీవల విడుదలైన సైరా టీజర్‌కు ఇంటర్నెట్ మీడియాలో విశేష స్పందన లభిస్తున్నది. యూట్యూబ్‌లో ఈ టీజర్‌కు సుమారు 12 మిలియన్ల వ్యూస్ రావడం విశేషం. 24 గంటల్లో అత్యధిక వ్యూస్ సాధించిన టీజర్‌గా టాలీవుడ్‌లో ఓ రికార్డు నెలకొల్పింది.

వచ్చే ఏడాది వాయిదా
భారీ బడ్జెట్, అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందుతున్న సైరా నర్సింహారెడ్డి చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ చిత్రానికి మెగా పవర్ స్టార్ రాంచరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











