జార్జియాకు చిరంజీవి.. 200 మందితో .. 40 రోజులు అక్కడే!
Recommended Video

మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రూపొందుతున్న సైరా నర్సింహారెడ్డి చిత్ర షూటింగ్ శరవేగంగా సాగుతున్నది. మెగా పవర్‌స్టార్ రాంచరణ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని యుద్ద సన్నివేశాలను ఇటీవల హైదరాబాద్‌లో చిత్రీకరించారు. ఈ చిత్రంలో కీలకంగా మారే వార్ సీక్వెన్స్‌ను షూట్ చేసేందుకు సైరా నర్సింహారెడ్డి చిత్ర యూనిట్ జార్జియాకు వెళ్తున్నది. వివరాల్లోకి వెళితే.. ..

కనీవిని ఎరుగని రీతిలో
టాలీవుడ్ ఆడియెన్స్‌ను కొత్త అనుభూతికి గురిచేయాలనే సంకల్పంతో నిర్మాత రాంచరణ్ ఉన్నారు. ఈ సినిమా కోసం ఖర్చు ఎంతైనా సరే వెనుకాడబోమని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో చిత్రంలోని యుద్ద సన్నివేశాలను కనివినీ ఎరుగని రీతిలో చిత్రీకరించేందుకు సినిమా యూనిట్ యూరప్‌కు వెళ్తున్నది.

50 కోట్లతో 40 రోజులు షూట్
బ్రిటీష్ ప్రభుత్వంపై ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి పోరాటం చేసే సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. దాదాపు 200 మందితో చిత్ర యూనిట్ తరలివెళ్లనున్నది. ఇందుకోసం రూ.50 కోట్లను ఖర్చు చేయనున్నారని తెలిసింది. దాదాపు 40 రోజులపాటు అక్కడే యుద్ధ సన్నివేశాలను చిత్రీకరిస్తారని తెలిసింది.

గ్రాండ్‌గా తెరకెక్కించేందుకు
సైరాలోని ప్రతీ సన్నివేశాన్ని చాలా గ్రాండ్‌గా తెరకెక్కించేందుకు నిర్మాత రాంచరణ్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటివరకు వెండితెరపై కనుపించని ప్రాంతాల్లో షూట్ చేయాలని నిర్ణయించారు. హైదరాబాద్‌లో షూట్ చేసిన యుద్ధ సన్నివేశాలకు రూ.5 కోట్లు ఖర్చు చేశారు. జార్జియాలో షూట్ చేసే సీన్లకు రూ.50 కోట్లు ఖర్చు చేయనున్నారు అని చిత్ర యూనిట్ పేర్కొన్నది.
వచ్చే వేసవిలో సైరా నర్సింహారెడ్డి
భారీ బడ్జెట్, అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందుతున్న సైరా నర్సింహారెడ్డి చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. సైరా నర్సింహారెడ్డి చిత్రంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డికి గురువుగా కనిపించబోతున్నారు. ఇంకా ఈ చిత్రంలో నయనతార, తమన్నా, జగపతిబాబు తదితరులు నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











