కొండలు, కోనలు, జలపాతాల్లో ‘సైరా’ షూటింగ్... ఎక్కడో తెలుసా?
మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'సైరా నరసింహారెడ్డి' ప్రస్తుతం కొండలు, కోనలు, జలపాతాల్లో షూటింగ్ జరుపుకుంటోంది. ఇదంతా ఎక్కడ జరుగుతుందో తెలుసా? హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో. అలాంటి సెట్స్ క్రియేట్ చేసి పోరాట సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.
బ్రిటిష్ సైన్యంపై నరసింహారెడ్డి యుద్ధం చేసే సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరిస్తున్నారు. సినిమాలో ఈ పోరాట సన్నివేశాలు హైలెట్‌గా ఉంటాయని చిత్ర బృందం చెబుతోంది. రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్న షూటింగులో చిరంజీవితో పాటు నయనతార, జగపతి బాబు, ఇతర ముఖ్యతారాగణం పాల్గొంటున్నట్లు సమాచారం.

దీనికంటే ముందు సైరా బృందం 35 రోజుల పాటు హైదాబాద్‌లో ఓ షెడ్యూల్ పూర్తి చేశారు. రాత్రివేళలో పలు పోరాట సన్నివేశాలు చిత్రీకరించారు. అయితే అనుమతి లేకుండా ప్రభుత్వ భూమిలో సెట్ వేశారంటూ రెవెన్యూ అధికారులు కూల్చిన వేయడంతో షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీకి షిప్టయింది. ఇక్కడ షూటింగ్ ముగిసిన అనంతరం... యూరఫ్‌లో ఓ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
కాగా... మెగా అభిమానులంతా ఆగస్టు 22 కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ రోజు మెగాస్టార్ చిరంజీవి పెట్టినరోజు పురస్కరించుకుని సినిమాకు సంబంధించిన టీజర్ విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











