సైరా యుద్ధం కోసం అంతా సిద్ధం.. భారీగా సెటప్ చూడండి!
సైరా నరసింహా రెడ్డి చిత్ర షూటింగ్ మహా యజ్ఞంలా సాగుతోంది. 200 కోట్లకు పైగా బడ్జెట్ లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఉయ్యాలావాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రని వెండి తెరపై దృశ్య కావ్యంలా తీర్చి దిద్ధేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం చిత్ర యూనిట్ మొత్తం భారీషెడ్యుల్ కోసం జార్జియా వెళ్లిన సంగతి తెలిసిందే.
భారీ యుద్ధ సన్నివేశాన్ని చిత్రీకరించనున్నారు. షూటింగ్ లొకేషన్ లో యుద్ధం కోసం అంతా సిద్ధం చేసిన భారీ సెటప్ కి సంబందించిన ఫోటోలని దర్శకుడు సురేందర్ రెడ్డి సోషల్ మీడియాలో షేర్ చేశారు. జార్జియాలోని విశాలమైన ప్రాంతంలో సైరా షూటింగ్ కు అంతా సిద్ధం చేశారు. ఈ ఒక్క షెడ్యూల్ కోసమే దాదాపు 50 కోట్ల బడ్జెట్ ఖర్చు చేయనున్నట్లు తెలుస్తోంది.

మెగాస్టార్ చిరంజీవిని స్వాతంత్ర సమర యోధుడిగా చూడాలనే అభిమానుల ఉత్కంఠ రోజు రోజుకు పెరుగుతోంది. ఇటీవల విడుదలైన టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











