RC15: రామ్ చరణ్‌తో టీడీపీ ఎమ్మెల్యే భేటీ.. మళ్లీ అదే లుక్‌లో మెగా హీరో

బడా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌తోనే సినిమాల్లోకి వచ్చినా.. కెరీర్ ఆరంభంలోనే భారీ విజయాలను సొంతం చేసుకుని స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుని బడా హీరోగా ఎదిగిపోయాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఈ మధ్య కాలంలో విభిన్నమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తోన్న అతడు.. తన రేంజ్‌ను అంతకంతకూ పెంచుకుంటూ ముందుకు సాగుతోన్నాడు. ఈ క్రమంలోనే గత ఏడాది వచ్చిన RRR (రౌద్రం రుధిరం రణం) అనే మూవీతో చరణ్ మరో ఇండస్ట్రీ హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. అలాగే, ఈ మూవీతో తన క్రేజ్ అంతర్జాతీయ స్థాయికి పెంచుకుని దూసుకెళ్తోన్నాడు.

ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. దిగ్గజ దర్శకుడు శంకర్‌తో కలిసి ఓ సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతూ వస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన 60 శాతానికి పైగా టాకీ పార్ట్ కూడా విజయవంతంగా కంప్లీట్ అయిపోయింది. అంతేకాదు, ఇటీవలే హైదరాబాద్‌లోని చార్మినార్ దగ్గర కూడా చిత్రీకరణ జరిపారు. ఆ వెంటనే కర్నూలులోని కొండారెడ్డి బురుజు దగ్గర కూడా చిత్రీకరణ జరిపారు. ఇక, ఇప్పుడు విశాఖపట్నంలో షూటింగ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా రామ్ చరణ్‌తో టీడీపీ ఎమ్మెల్యే భేటీ అవడం ఆసక్తికరంగా మారిపోయింది.

TDP MLA Ganta Srinivasa Rao Met Ram Charan at RC15 Sets

రామ్ చరణ్ - శంకర్ సినిమా షూటింగ్ విశాఖపట్నం సమీపంలోని సింహాచలం దేవస్థానం పరిసరాల్లో జరుగుతోంది. ఈ నేపథ్యంలో స్థానిక శాసనసభ్యుడు, టీడీపీ నాయకుడు గంటా శ్రీనివాసరావు ఈ సినిమా సెట్స్‌ను సందర్శించారు. అంతేకాదు, రామ్ చరణ్‌తో ఆయన సమావేశం అయ్యారు. అలాగే, చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపినట్లు తెలిసింది. ఇక, గంటా శ్రీనివాసరావుకు మెగాస్టార్ చిరంజీవితో ప్రత్యేక అనుబంధం ఉంది. ఆయన ప్రజారాజ్యం పార్టీలోనే పని చేశారు. ఈ కారణంగానే రామ్ చరణ్‌తో గంటా భేటీ అయినట్లు తెలిసింది. ఇక, వీళ్లిద్దరూ కలిసి ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోన్నాయి. ఈ ఫొటోల్లో చరణ్ 'ధృవ' సినిమా లుక్‌తో కనిపిస్తున్నాడు.

TDP MLA Ganta Srinivasa Rao Met Ram Charan at RC15 Sets

ఈ చిత్రంలో రామ్ చరణ్‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాణీ నటిస్తోంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అలాగే, ఈ సినిమాకు ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. శ్రీకాంత్, జయరాం, అంజలి తదితరులు కీలక పాత్రలను చేస్తున్నారు. ఈ సినిమాకు 'సిటిజన్' అనే టైటిల్‌ పరిశీలనలో ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X