Don't Miss!
- News మేషరాశిలో శుక్ర దహనం.. ఈ రాశులవారికి కెరీర్ లో పెనుసవాళ్లు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
అజిత్ విశ్వం షూట్ ఫొటోలు లీక్.. ఇంటర్నెట్లో వైరల్
తమిళ సూపర్‌స్టార్ తలా అజిత్ నటిస్తున్న చిత్రం విశ్వం. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకొంటున్నది. ఈ చిత్రంలో అజిత్ ద్విపాత్రాభినయం చేస్తున్నారనే విషయం అభిమానుల్లో ఆసక్తిని రేపుతున్నది.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫైట్ సీన్లను గుట్టుచప్పుడు కాకుండా షూట్ చేస్తున్నారు. అయితే ఆ షూటింగ్‌కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తెల్లటి గడ్డ, జుట్టుతో కనిపిస్తున్న అజిత్ పంచెకట్టుతో అదరగొట్టేలా కనిపించాడు.
విశ్వం చిత్రంలో అజిత్ సరసన నయనతార హీరోయిన్గా నటిస్తున్నది. వారిద్దరూ కలిసి నటించడం ఇది మూడోసారి. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించారు.
అజిత్ విశ్వం, సూర్య ఎన్జీకే, విజయ్ సర్కార్ చిత్రాలు సంక్రాంతి బరిలో దూకనున్నాయి. ఈ మూడు చిత్రాలు ఒకే రోజున రిలీజ్ కావడంపై సినీ వర్గాలు తలోరకంగా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. కాకపోతే ఈ చిత్రాలు రిలీజైతే అభిమానులకు నిజమైన పండుగ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు.