Thandel: తండేల్ సెట్స్ నుంచి సర్‌ప్రైజ్.. సాయి పల్లవి అలా.. నాగ చైతన్య ఇలా!
తెలుగు చిత్ర పరిశ్రమలోకి చాలా మందే స్టార్ల వారసులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. కానీ, వారిలో అతి తక్కువ మంది మాత్రమే తమదైన చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించి మంచి ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు. అందులో కింగ్ అక్కినేని నాగార్జున కుమారుడు, యువ సామ్రాట్ నాగ చైతన్య ఒకడు. ఆరంభం నుంచీ రిజల్ట్‌తో సంబంధం లేకుండా అతడు సినిమాలు చేస్తున్నాడు.
ఆ మధ్య వరుస హిట్లు కొట్టిన నాగ చైతన్య.. కొంత కాలంగా సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్నాడు. ఈ పరిస్థితుల్లో కొద్ది రోజుల క్రితమే 'ధూత' వెబ్ సిరీస్‌తో సత్తా చాటాడు. ఈ ఉత్సాహంతోనే ఇప్పుడు అతడు 'తండేల్' అనే మూవీ చేస్తున్నాడు. చందూ మొండేటి దర్శకత్వంలో వహిస్తోన్న ఈ చిత్రం రియల్ స్టోరీతో తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే.

అక్కినేని నాగ చైతన్య - చందూ మొండేటి కాంబోలో రాబోతున్న 'తండేల్' మూవీ సముద్రంలో చేపల వేట కోసం వెళ్లి పాకిస్థాన్‌లో జైలు శిక్ష అనుభవించిన శ్రీకాకుళం మత్స్యకారుడి రియల్ స్టోరీ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇటీవలే దీన్ని అధికారికంగా ప్రారంభించారు. అప్పటి నుంచి వరుసగా షెడ్యూళ్లను జరుపుతూ చాలా వరకూ టాకీ పార్టును కంప్లీట్ చేసుకున్నారు.
'తండేల్' సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే చిత్ర యూనిట్ తాజాగా ఓ అందమైన పల్లెటూరిలో మంచి షెడ్యూల్‌ను కంప్లీట్ చేసుకుంది. ఇందులో హీరో నాగ చైతన్య, హీరోయిన్ సాయి పల్లవితో పాటు మరికొందరు ప్రధాన నటులు భాగం అయ్యారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.
'తండేల్' మూవీ తాజా షెడ్యూల్ ఫొటోలను షేర్ చేసిన చిత్ర యూనిట్.. 'తండేల్ బృందం సుందరమైన గ్రామంలో షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. మెయిన్ లీడ్ ఇందులో భాగం అయ్యారు. ఈ షెడ్యూల్‌లో ఓడ రేవు, గ్రామంలో సీన్స్ చిత్రీకరించాము. మరిన్ని అప్‌డేట్లు త్వరలోనే రాబోతున్నాయి' అని తెలిపింది. ఇక, ఈ ఫొటోలు అన్నీ ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి.
ఇదిలా ఉండగా.. 'తండేల్' మూవీలో నాగ చైతన్య సరసన నేచురల్ హీరోయిన్ సాయి పల్లవి నటిస్తోంది. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ మూవీని ఈ ఏడాది మధ్యలోనే రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











