వేగంగా కారు నడిపిన విజయ్ దేవరకొండ.. యాక్సిడెంట్.. ఎక్కడ, ఎలా అంటే!
Recommended Video
టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ వేగంగా కారు నడపడంతో ఆ కారు యాక్సిడెంట్‌కి గురైందని తెలుస్తోంది. అంతేకాదు ఆయనను వెనుక నుంచి రౌడీలు కూడా వెంటాడారట. అరె! ఇదేదో సినిమా సన్నివేశం లాగానే అనిపిస్తుందే.. అనుకుంటున్నారు కదూ. నిజమే ఇదంతా రియల్‌గా కాదు.. విజయ్ దేవరకొండ కొత్త సినిమాలో. ఇంతకీ పూర్తి వివరాలేంటి? అంటారా..

డియర్ కామ్రేడ్ తర్వాత విజయ్ దేవరకొండ
ఇటీవలే డియర్ కామ్రేడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి కాస్త నిరాశ చెందిన విజయ్ దేవరకొండ ఈ సారి మరింత స్ట్రాంగ్‌గా దిగాలని ఫిక్స్ అయ్యాడట. ఈ మేరకు క్రాంతి మాధవ్ దర్శకత్వంలో కొత్త సినిమా చేసేందుకు కమిట్ అయ్యాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో భాగంగానే విజయ్ దేవరకొండపై కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది.

ఫ్రాన్స్ నుంచి వచ్చి.. హైదరాబాద్‌లో
ఈ సినిమా తొలి షెడ్యూల్ ఫ్రాన్స్ లోని అందమైన లొకేషన్స్ లో చిత్రీకరించారు. ఆ వెంటనే హైదరాబాద్ వచ్చిన చిత్రయూనిట్ గత నాలుగు రోజులుగా రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుపుతున్నారు. ఇందులో భాగంగా ఓ సీన్ షూట్ చేశారట. ''విజయ్ దేవరకొండ కారు వేగంగా నడుపుతుంటే ఆయన వెనక రౌడీలు పడటం.. అనూహ్యంగా విజయ్ నడుపుతున్న కారు యాక్సిడెంట్‌కు గురి కావడం'' అనే సీన్ చిత్రీకరణ జరిగిందట.

విజయ్ సరసన ముగ్గురు హీరోయిన్లు
ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాలోని విజయ్ దేవరకొండ లుక్ బయటకు వచ్చి వైరల్ అయినా సంగతి తెలిసిందే. ఇంకా ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ క్యారెక్టర్ డిఫెరెంట్ గా ఉంటుందని, ఆయన ఓ రైటర్‌గా కనిపించనున్నాడని తెలుస్తోంది.

క్రాంతి మాధవ్ దర్శకత్వంలో మూవీ
క్రాంతి మాధవ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను కె.ఎస్.రామారావు సమర్పణలో క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై కె.ఎ.వల్లభ నిర్మిస్తున్నారు. చిత్రంలో విజయ్ దేవరకొండతో పాటు రాశి ఖన్నా, ఐశ్వర్య రాజేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా అతిత్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











