'అరవింద సమేత' ఫోటో లీక్.. త్రివిక్రమ్ అప్సెట్, కఠిన చర్యలు మొదలు!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న అరవింద సమేత చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న తొలి చిత్రం ఇది. అజ్ఞాతవాసి పరాజయం తరువాత త్రివిక్రమ్ ఈ చిత్రం విషయంలో పకడ్బందీగా వ్యవహరిస్తున్నాడు. ఆ మధ్యన విడుదలైన ఫస్ట్ లుక్ తో అంచనాలు రెట్టింపయ్యాయి. తాజగా లీకైన స్టిల్ ఒకటి సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారిన సంగతి తెలిసిందే. కానీ ఈ లీకేజి వ్యవహారంపై త్రివిక్రమ్ సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది.
Recommended Video


ఎమోషనల్ పిక్
ఎన్టీఆర్, నాగబాబుకు సంబందించిన కీలక సన్నివేశంలో స్టిల్ లీకైంది. గాయాలతో ఉన్న నాగబాబు వైపు ఎన్టీఆర్ ఎమోషనల్ గా చూస్తున్నాడు. ఈ ఫొటోలో ఎన్టీఆర్ ఎమోషన్ చూసి ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు.

త్రివిక్రమ్ అప్సెట్
పబ్లిసిటీ సంగతి అటుంచితే కీలక సన్నివేశానికి సంబందించిన పిక్ లీక్ కావడంతో త్రివిక్రమ్ చిత్ర యూనిట్ పై సీరియస్ అయినట్లు తెలుస్తోంది. కఠిన చర్యలు మొదలుపెట్టినట్లు వార్తలు వస్తున్నాయి.

అనుమతి ఉంటేనే
ఇకపై చిత్ర సభ్యులెవరూ సెట్ లోకి మొబైల్ ఫోన్స్ తీసుకుని రావద్దని ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ప్రత్యేకమైన పరిస్థితుల్లో అనుమతి ఉంటేనే మొబైల్ ఫోన్స్ తీసుకురావాలని నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది.

లీకేజీవలన ఇబ్బందే
అరవింద సమేత చిత్రం భారీ బడ్జెట్ తో రూపొందుతోంది. లీకేజి సమస్య పెద్ద చిత్రాలకు ఉండేదే. కానీ కీలకమైన విషయాలు లీక్ అయితే చిత్రంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఒక్క స్టిల్ లీక్ వలన అరవింద సమేత చిత్రానికి ఇప్పటికి ఇప్పుడు వచ్చిన నష్టం అయితే లేదు కానీ భవిషత్తులో ఇలాంటి లీకులు పునరావృతం కాకుండా చూసుకోవాలి.

రెండు కోణాల్లో
ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్ర రెండు కోణాల్లో సాగుతుందని వార్తలు వస్తున్నాయి. పూజా హెగ్డే ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. రాధాకృష్ణ ఈ చిత్రానికి నిర్మాత.


Click it and Unblock the Notifications











