Ugly Story యువ హీరోతో అవికా గోర్ రొమాన్స్.. గ్లింప్స్‌తోనే అంచనాలు పెంచి!
తెలుగు సినిమా రంగానికి ఫీల్‌గుడ్, హిట్ సినిమాలను అందించిన లక్కీ మీడియా, రియా జియా బ్యానర్లపై నిర్మాత బెక్కం వేణుగోపాల్, సీహెచ్ సుభాషిణి, కొండా లక్ష్మణ్ నిర్మిస్తున్న చిత్రం అగ్లీ స్టోరి (Ugly Story). నందూ, అవికా గోర్ జంటగా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా ప్రణవ స్వరూప్ అనే దర్శకుడు టాలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మోషన్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ మోషన్ పోస్టర్ వివరాల్లోకి వెళితే..
అగ్లీ స్టోరి (Ugly Story) మూవీ మోషన్ గ్లింప్స్ వివరాల్లోకి వెళితే.. నందూ, అవికా గోర్ వర్షంలో తడుస్తూ ఒకరిప్రేమలో మరొకరు మునిగిపోతుండగా.. ఓ వ్యక్తి వారి వద్దకు నడుచుకొంటూ వస్తాడు. ఆ వ్యక్తి వెనుక భాగంలో ఉన్న పిస్టల్‌ను తీసుకొని నందూ, అవికా గుండెల్లోకి నేరుగా షూట్ చేస్తాడు. అనంతరం నా ఊహల్లో ఉన్న ప్రేమ.. నిజ జీవితంలో లేదు అంటూ ఆ వ్యక్తి డైలాగ్ చెప్పడంతో గ్లింప్స్ ఆసక్తికరంగా ముగిసింది. ఈ గ్లింప్స్ కొత్త కంటెంట్‌తో మూవీ వస్తుందనే ఆలోచనను రేకెత్తించింది.

అగ్లీ స్టోరి (Ugly Story) గ్లింప్స్ రిలీజ్ సందర్భంగా దర్శకుడు ప్రణవ్ స్వరూప్ మాట్లాడుతూ.. లక్కీ మీడియా రియా రిజా నిర్మిస్తున్న అగ్లి స్టోరి ఓ మంచి కంటెంట్ ఉన్న సినిమా. 2024లో మంచి హిట్ కొట్టబోతున్నాం. నిర్మాతలు నా కథను నమ్మి ఈ సినిమాను నిర్మించడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను తెరకెక్కిస్తున్నాం అని అన్నారు.

అగ్లీ స్టోరి (Ugly Story) సినిమా గ్లింప్స్‌లో చెప్పిన డైలాగ్స్‌కు మంచి స్పందన లభిస్తున్నది. యూత్‌కు కనెక్ట్ అయ్యే ఇలాంటి డైలాగ్స్ చాలా ఉన్నాయి. త్వరలోనే అందర్నీ ఆకట్టుకొనే విధంగా టీజర్, ట్రైలర్ తీసుకొస్తాం. భారీగా ఈ సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం. ఈ సినిమాను మంచి హిట్ చేస్తారని ఆశిస్తున్నాను అని ప్రణవ్ చెప్పారు.
నటీనటులు: నందూ, అవికా గోర్, రవితేజ మహాదాసయం, శివాజీ రాజా, ప్రజ్ఞా నయన్
దర్శకత్వం: ప్రణవ స్వరూప్
నిర్మాతలు: బెక్కెం వెణుగోపాల్, సుభాషిణి, కొండా లక్ష్మణ్
సినిమాటోగ్రఫి: శ్రీ సాయికుమార్ దారా
ఎడిటింగ్: శ్రీకాంత్ పట్నాయక్
మ్యూజిక్: శ్రవణ్ భరద్వాజ్
బ్యానర్: లక్కీ మీడియా, రియా జియా


Click it and Unblock the Notifications











