twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆదిలోనే షాక్.. లీకైన వెంకీ మామ సన్నివేశం!

    |

    విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి విడుదలైన ఎఫ్2 చిత్రంలో కెరీర్ లోనే అతి పెద్ద విజయాన్ని అందుకున్నారు. వెంకటేష్ కొత్త చిత్రం వెంకీ మామ షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది. రియల్ లైఫ్ మామ అల్లుళ్ళు వెంకటేష్, నాగ చైతన్య హీరోలుగా ఈ మల్టీస్టారర్ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రాన్ని దరకుడు బాబీ. ఈ చిత్ర ఫస్ట్ షెడ్యూల్ లో భాగంగా రాజమండ్రిలో షూటింగ్ జరుగుతోంది.

    Venkatesh, Naga Chaitanyas Venky Mama scene leaked online

    అలా షూటింగ్ ప్రారంభమైందో లేదో అప్పుడే ఈ చిత్రానికి లీకుల బెడద మొదలైపోయింది. నాగ చైతన్యకు సంబందించిన ఇంట్రడక్షన్ సన్నివేశాలు లీకై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొన్ని షూటింగ్ లొకేషన్ ఫోటోలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. పల్లెటూరి వాతావరణంలో కామెడీ ప్రధానాంశంగా బాబీ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

    Venkatesh, Naga Chaitanyas Venky Mama scene leaked online

    సురేష్ ప్రొడక్షన్స్, కోన వెంకట్ సంయుక్త నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. వెంకటేష్ సరసన ఆర్ఎక్స్ 100 బ్యూటీ పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటిస్తోంది. నాగ చైతన్య సరసన రాశి కన్నా హీరోయిన్ గా ఎంపికైంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

    English summary
    Venkatesh, Naga Chaitanya's Venky Mama scene leaked online
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X