ఫోటోలు : ఫుల్ జోష్‌లో వరుణ్ తేజ్, వెంకీ.. విదేశాల్లో సందడి చూశారా!
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న మల్టి స్టారర్ చిత్రం ఎఫ్ 2 షూటింగ్ జోరుగా సాగుతోంది. పరాజయం ఎరుగని దర్శకుడు అనిల్ రావిపూడి దర్శత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అనిల్ రావిపూడి తెరకెక్కించిన మూడు చిత్రాలు పటాస్, సుప్రీం, రాజా ది గ్రేట్ మంచి విజయం సాధించాయి. ఈ మూడు చిత్రాల్లో వినోదం ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ఇప్పడు వెంకీ, వరుణ్ కలసి నటిస్తుండడంతో ఈ చిత్రంపై మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.

విదేశాల్లో ఫన్
ఈ చిత్ర టైటిల్ ఎఫ్2. ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ అనేది క్యాప్షన్. టైటిల్ కు తగ్గట్లుగానే ఈ చిత్ర షూటింగ్ విదేశాల్లో సరదాగా సాగుతోంది. తాజా ప్రగ్వేలో కీలకమైన షెడ్యూల్ పూర్తి చేసాం అని దర్శకుడు అనిల్ రావిపూడి ప్రకటించాడు.

సూపర్ స్టైలిష్‌గా
ప్రగ్వే షెడ్యూల్ కి సంబందించిన లొకేషన్ స్టిల్స్ ని అనిల్ రావిపూడి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ ఫొటోల్లో వెంకీ, వరుణ్ తేజ్ స్టైలిష్ లుక్ లో అదరగొడుతున్నాడు.

మల్టీస్టారర్స్ హవా
ప్రస్తుతం టాలీవుడ్ లో మల్టీస్టారర్స్ హవా కొనసాగుతోంది. విక్టరీ వెంకటేష్ మల్టీస్టారర్ చిత్రాలకు బ్రాండ్ అంబాసిడర్ గా మారాడు. వెంకీ, వరుణ్ తేజ్ లకు జోడిగా తమన్నా, మెహ్రీన్ నటిస్తుండడం విశేషం.

దేవిశ్రీ ప్రసాద్
ఈ ఫన్ ఎంటర్ టైనర్ కు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. దిల్ రాజు నిర్మాణంలో ఈ చిత్రం తెరక్కుతోంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ అదిరిపోయే పాటలు అందించాడని వరుణ్ తేజ్ ఇప్పటికే ప్రకటించాడు.


Click it and Unblock the Notifications











