‘వెంకీ మామ’ కంప్లీట్ అయింది, రిలీజ్ ఎప్పుడంటే...
విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగ చైతన్య మల్టీ స్టారర్‌గా రూపొందుతున్న చిత్రం వెంకీ మామ. పాయల్ రాజ్ పుత్, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. కెఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సురేష్ బాబు, టీజీ విశ్వ ప్రసాద్ సంయుక్తంగా సురేష్ ప్రొడక్షన్స్ , పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బేనర్లో నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్.తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.
తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఫార్మాలిటీస్ పూర్తయినట్లు తెలుస్తోంది. మైనర్ ప్యాచ్ వర్క్ మాత్రమే మిగిలి ఉందట. ఈ మూవీ దసరా సందర్భంగా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది మంచి ఫ్యామిలీ ఎంటర్టెనర్ కావడంతో దసరా సందర్భంగా విడుదల చేస్తే మంచి వసూళ్లు వస్తాయనే ఉద్దేశ్యంతో ఇలా డిసైడ్ చేశారట.

కొన్ని రోజుల క్రితం వెంకీ మామ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. రియల్ లైఫ్ మామ అల్లుళ్లు అయిన వెంకటేష్, నాగ చైతన్య కలిసి నటిస్తుండటంతో ఈ చిత్రంపై అంచనాలు మరింత పెరిగాయి. అక్కినేని, దగ్గుబాటి అభిమానులకు ఇది మంచి కిక్కిచ్చే సినిమా అవుతుందని అంటున్నారు.
ఈ మధ్య కాలంలో వెంకటేష్ సోలో సినిమాలు చేయకుండా యువ హీరోలతో కలిసి తనకు సూటయ్యే సబ్జెక్టులు చేయడానికి ఇష్టపడుతున్నారు. ఇంతకు ముందు ఆయన వరుణ్ తేజ్‌తో కలిసి నటించిన 'ఎఫ్ 2' మూవీ భారీ విజయం అందుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 'వెంకీ మామ'పై హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి.


Click it and Unblock the Notifications











