భారీ బడ్జెట్‌తో విజయ్‌ ఆంటోని.. అక్కడ షూటింగ్‌ జరుపుకుంటోన్న తొలి ఇండియన్‌ సినిమా

'బిచ్చగాడు'తో తెలుగు రాష్ట్రాల్లో మంచి పాపులారిటీ పొందారు విజయ్‌ ఆంటోనీ. కంటెంట్‌ ఉన్న సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ మంచి ఆదరణ పొందుతున్నారు. ప్రస్తుతం విజయ్‌ ఆంటోనీ, అరుణ్‌ విజయ్, అక్షరా హాసన్‌ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న తమిళ చిత్రం 'అగ్ని సిరగుగల్‌'. ప్రస్తుతం తెలుగు, తమిళంలో రెడీ అవుతున్న క్రేజీ సినిమాల్లో ఇదొకటి.

ఈ సినిమాను తెలుగులో 'జ్వాల' టైటిల్‌తో విడుదల చేయబోతున్నారు జవ్వాజి రామాంజనేయులు, యం.రాజశేఖర్‌. దాదాపు 25 కోట్ల రూపాయల భారీ వ్యయంతో ఈ చిత్రం తెరకెక్కనుండటం విశేషం. ఈ రోజు హీరో విజయ్‌ ఆంటోని ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. చిత్రీకరణ తుది దశలో ఉన్న జ్వాల విశేషాల గురించి చిత్రబృందం మాట్లాడింది.

జ్వాల తొలి షెడ్యూల్‌ను చెన్నై, కోల్‌కత్తా వంటి లొకేషన్స్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరించామని తెలిపారు. ఆ తర్వాతి షెడ్యూల్‌ను మాస్కో, రష్యా వంటి దేశాల్లో కనువిందైన లొకేషన్స్‌లో షూట్‌ చేశామని పేర్కొన్నారు. ప్రస్తుతం తుది షెడ్యూల్‌ను కజకిస్తాన్‌లో షూట్‌ చేస్తున్నామని ప్రకటించారు. కజకిస్తాన్‌లో షూటింగ్‌ జరుపుకుంటున్న తొలి ఇండియన్‌ సినిమా మాదే అని చెప్పడం చాలా సంతోషంగా ఉందన్నారు.

Vijay Antony New Movie Jwala Updates

విజువల్‌ ఫీస్ట్‌గా తమ సినిమా ఉండబోతోందన్నారు. ఈ సినిమాలో యాక్షన్‌ సన్నివేశాలు యాక్షన్‌ మూవీ లవర్స్‌ విపరీతంగా ఎంజాయ్‌ చేస్తారని అనుకుంటున్నామని అన్నారు. ఇంటర్నేషనల్‌ స్థాయిలో ఈ సినిమా ఉండబోతోంది అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదన్నారు. సినిమా అవుట్‌పుట్‌ చూస్తుంటే చాలా సంతృప్తికరంగా ఉందని తెలిపారు.

దర్శకుడు నవీన్‌ అద్భుతమైన విజన్‌తో యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ను రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. అతి త్వరలోనే ట్రైలర్, ఆడియో, చిత్ర రిలీజ్‌ వివరాలు తెలియజేస్తామని తెలిపారు. రైమా సేన్, ప్రకాశ్‌ రాజ్, ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: నటరాజన్‌ శంకరన్, కెమెరా: కేఏ బట్చా, సమర్పణ- అమ్మ క్రియేషన్స్‌ టి.శివ, నిర్మాతలు-జవ్వాజి రామాంజనేయులు, యం.రాజశేఖర్‌. ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: శివ మల్లాల.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X