విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. మొత్తానికి ఖుషి సెట్టయ్యింది!

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ లైగర్ సినిమా తర్వాత వెంటనే ఖుషి సినిమాను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకున్నాడు. అయితే ఈ సినిమా అనుకోని కారణాల వలన వాయిదా పడుతూ వస్తోంది. దర్శకుడు శివ నిర్వణ ఈ సినిమా షూటింగ్ ఈపాటికే పూర్తి చేయాలని కూడా అనుకున్నాడు. కానీ మధ్యలో హఠాత్తుగా సమంత కొంత అనారోగ్యానికి గురి కావడంతో మళ్లీ ఆ సినిమా షూటింగ్ వాయిదా పడాల్సి వచ్చింది.

ఇక మధ్యలో దర్శకుడు శివ నిర్వణ ఆ సినిమా షూటింగ్ ఆపేసి మరొక సినిమా షూటింగ్లో పాల్గొనే అవకాశం ఉన్నట్లుగా కూడా కథనాలు వెలుపడ్డాయి. కానీ అందులో ఎలాంటి నిజం లేదు అని దర్శకుడు మళ్ళీ అధికారికంగా క్లారిటీ అయితే ఇచ్చాడు. ఇక ప్రస్తుతం సమంత బాలీవుడ్ వెబ్ సిరీస్ కోసం సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఇటీవల కాలంలో ఆమె ఫిట్నెస్ కు సంబంధించిన వీడియోలు కూడా పోస్ట్ చేసింది.

Vijay devarakonda kushi movie latest shooting update

అయితే ప్రాజెక్ట్ కంటే ముందు ఆమె ఖుషి సినిమాకు సంబంధించిన కీలకమైన మరొక షెడ్యూల్ను పూర్తి చేయబోతోంది. ఈనెల 27, 28వ తేదీల్లో విజయ్ దేవరకొండ తో కొన్ని ఎపిసోడ్స్ చేయబోతున్నారు. ఇక తర్వాత మళ్లీ గ్యాప్ ఇచ్చి మార్చి 8న మరొక కీలకమైన షెడ్యూల్ స్టార్ట్ చేయబోతున్నారు. సమ్మర్ లో వైజాగ్ కొంత షూటింగ్ను పూర్తిచేసి పెండింగ్లో ఉన్న భాగాన్ని కూడా వీలైనంత త్వరగా పూర్తిచేయాలని రెడీ చేసుకుంటున్నారు. ఖుషి సినిమాను వీలైనంత త్వరగా పాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగానే విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాతో పాటు విజయ్ దేవరకొండ ఇటీవల గౌతం తిన్ననూరితో కూడా ఒక సినిమాను ఓకే చేసిన విషయం తెలిసిందే. అలాగే సుకుమార్ తో కూడా భవిష్యత్తులో విజయ్ ఒక సినిమా చేయాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X