Don't Miss!
- Finance Kotak Mahindra Bank: కొంపముంచి కోటక్ మహీంద్రా బ్యాంక్.. భారీగా పడిపోయిన స్టాక్..!
- Technology ఆపిల్ తరహా డిజైన్‌తో నాయిస్ స్మార్ట్‌వాచ్.. 1.85 అంగుళాల డిస్ప్లే, 7 రోజుల బ్యాటరీ లైఫ్‌తో విడుదల
- News వీళ్లా..వైఎస్ వారసులు, పక్కన పెట్టింది ఇందుకే - షర్మిల పై జగన్ ఫైర్..!!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్‌కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఫ్రాన్స్‌లో మొదలుపెట్టిన విజయ్ దేవరకొండ.. ఏకంగా ముగ్గురు హీరోయిన్లతో కలిసి..
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండకు సంబందించిన ఓ కీలక అప్డేట్ వచ్చింది. ప్రస్తుతం ఫ్రాన్స్ లో తన ఫ్యామిలీతో జాలీగా ఎంజాయ్ చేస్తున్న ఆయన పనిలో పనిగా తన కొత్త సినిమా షూటింగ్ లో కూడా పాల్గొంటున్నాడట. ఈ విషయాన్ని తెలుపుతూ తాజాగా విజయ్ దేవరకొండ స్మైలీ లుక్ ఒకటి రిలీజ్ చేసింది చిత్రయూనిట్.
డియర్ కామ్రేడ్ మూవీ తర్వాత విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో కొత్త సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. కె.ఎస్.రామారావు సమర్పణలో క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై కె.ఎ.వల్లభ ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. చిత్రంలో విజయ్ దేవరకొండతో రొమాన్స్ చేసేందుకు ఏకంగా ముగ్గురు అందాల భామలు ఎన్నికవడం విశేషం. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఫ్రాన్స్‌లో జరుగుతోంది. చాలా రోజుల పాటు ఇక్కడే తిష్ట వేసి లాంగ్ షెడ్యూల్ చిత్రీకరణ జరిపేలా ప్లాన్ చేశారట దర్శకనిర్మాతలు.
కేవలం విజయ్‌దేవరకొండకు సంబందించిన షూట్ మాత్రమే గాకుండా.. ఇతర నటీనటులు, హీరోయిన్లపై తెరకెక్కించనున్న కొన్ని కీలక సన్నివేశాలను ఫ్రాన్స్ లోనే చిత్రీకరించనున్నారని సమాచారం. ఈ మేరకు తాజాగా ఈ విషయాన్ని తెలుపుతూ విజయ్ లుక్ రిలీజ్ చేయడంతో అది కాస్త వెంటనే వైరల్ అయింది. ఈ పిక్ లో విజయ్ యమ స్టైలిష్‌గా కనిపిస్తుండటం సినిమాపై ఆసక్తి కలిగించే అంశం. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ రొమాంటిక్ ట్రయాంగిల్ లవ్ ఎంటర్ టైనర్లో రాశీఖన్నా, ఐశ్వర్యా రాజేష్, ఇజాబెల్లె దె హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. గోపీసుందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో రాశిఖన్నాతో విజయ్ దేవరకొండ రొమాన్స్ బాగా హైలైట్ కానుందని తెలుస్తోంది. విజయ్ దేవరకొండ నటించిన మరో సినిమా 'డియర్ కామ్రేడ్' షూటింగ్ కంప్లీట్ చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది.